బీజేడీ పార్టీ సంతోష్‌ మిశ్రా రాజీనామా | - | Sakshi
Sakshi News home page

బీజేడీ పార్టీ సంతోష్‌ మిశ్రా రాజీనామా

Feb 8 2026 4:22 AM | Updated on Feb 8 2026 4:22 AM

బీజేడ

బీజేడీ పార్టీ సంతోష్‌ మిశ్రా రాజీనామా

కొరాపుట్‌: ప్రతిపక్ష బీజేడీ పార్టీకి సీనియర్‌ నాయకుడు సంతోష్‌ మిశ్ర (పింటూ) రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌కి రాజీనామా లేఖను శనివారం పంపించారు. నబరంగ్‌పూర్‌ కి చెందిన పింటూ జనతాదళ్‌ పార్టీ విద్యార్థి విభాగం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. జనతాదళ్‌ ఒడిశాలో బీజేడీగా రూపాంతరం చెందినప్పడు పింటూ కూడా బీజేడీలో కొనసాగారు. 1998లో పార్టీ మద్దతుతో నబరంగ్‌పూర్‌ మహా విద్యాలయం విద్యార్థి విభాగం అధ్యక్షునిగా గెలుపొందారు. 2002–12 మధ్య కాలంలో పార్టీ జిల్లా యువ విభాగ ఉపాధ్యకునిగా, 2012–16 మధ్య నబరంగ్‌పూర్‌ పట్టణ అధ్యక్షునిగా పని చేశారు. సుమారు దశాబ్ద కాలంగా పార్టీ మద్దతుతో జిల్లా కోర్టులో అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా కొనసాగారు. ప్రస్తుతం విడుదలైన పార్టీ జిల్లా కార్యవర్గంపై అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన పేర్కొన్నారు. పింటూ తండ్రి ప్రకాష్‌ మిశ్ర పార్టీకి అవిభక్త కొరాపుట్‌ జిల్లాల జనరల్‌ సెక్రటరీగా పని చేశారు.పింటూ రాజీనామాతో పార్టీ వర్గాలు ఉలిక్కి పడ్డాయి.

311 మంది వైద్య పరీక్షలు

పర్లాకిమిడి: ఇండియాన్‌ సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (ఐ.ఎస్‌.ఆర్‌.డి.), క్రాంతి స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా స్థానిక టౌన్‌హాల్‌లో ఉచిత క్యాన్సర్‌ పరీక్షలు, ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర కుమార్‌ పండా, ఏడీఎం (రెవెన్యూ) మునీంద్ర హనగ శనివారం ప్రారంభించారు. ఈ శిబిరంలో పురపాలక చైర్మన్‌ నిర్మలా శెఠి, జిల్లా సామాజిక సంక్షేమ శాఖ అధికారి మినాతీకుమారీ దెయి, డి.సి.పి.ఓ అరుణ్‌ కుమార్‌ త్రిపాఠి, ప్రొటెక్షన్‌, ప్రోగ్రాం అధికారి సరలా పాత్రో అతిథులుగా హాజరయ్యారు. 311 మందికి క్యాన్సర్‌, ఇతర వ్యాధుల స్క్రీనింగ్‌ చేశారు. ఈ శిబిరంలో జగన్నాథ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ కవితా మిశ్రా, క్యాన్సర్‌ నిపుణులు దిలీప్‌ కోరో, వైద్యులు సుర్జిత్‌ పాణిగ్రాహి, గిరిధర్‌ రవుతో, రోజాలినీ శతపతి, ఐ.ఎస్‌.ఆర్‌.డి డైరెక్టర్‌ నాగేశ్వర చౌదరి, క్రాంతి సంస్థ నిర్మలా మిశ్రా, ప్రీతిరాయ్‌, తదితరులు పాల్గొన్నారు.

బోధన–అభ్యాసన ప్రక్రియపై ఆడిట్‌ ప్రభావం

జయపురం: బోధన, అభ్యాసన ప్రక్రియ నాణ్యతపై అకాడమిక్‌ ఆడిట్‌ చూపుతుందని, అందువల్ల అకాడమిక్‌ ఆడిట్‌ అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక విక్రమదేవ్‌ విశవ్విద్యాలయంలో ఐక్యూ ఏసీ డైరెక్టర్‌ డాక్టర్‌ సుజిత్‌ కుమార్‌ దేహురి ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉషా పథకం పరిధిలో అకాడమిక్‌ ఆడిట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విక్రమదేవ్‌ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ దేవీ ప్రసాద్‌ మిశ్ర ప్రారంభించారు. బోధన–అభ్యాసన ప్రక్రియ నాణ్యతపై అకాడమిక్‌ ఆడిట్‌ ఎందుకు అవసరం, దాని ప్రభావం’ అన్న అంశాలపై చర్చ నిర్వహించారు. నిర్వహణ విక్రమదేవ్‌ విశ్వవిద్యాలయ రసాయనక శాస్త్రవిభాగ సహయ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బ్రజబంధు నందా, రసాయన శాస్త్రవిభాగ సహాయ ప్రొఫెసర్‌ డాక్టర్‌ స్మిత్‌ సాగర్‌ శతపతి, తదితరులు పాల్గొన్నారు.

బీజేడీ పార్టీ సంతోష్‌ మిశ్రా రాజీనామా 1
1/2

బీజేడీ పార్టీ సంతోష్‌ మిశ్రా రాజీనామా

బీజేడీ పార్టీ సంతోష్‌ మిశ్రా రాజీనామా 2
2/2

బీజేడీ పార్టీ సంతోష్‌ మిశ్రా రాజీనామా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement