చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Feb 8 2026 4:22 AM | Updated on Feb 8 2026 4:22 AM

చట్టాలపై అవగాహన అవసరం

చట్టాలపై అవగాహన అవసరం

పర్లాకిమిడి: బాల్య వివాహాలు రద్దు, నల్సా చట్టాలపై ప్రజాచైతన్య శిబిరాన్ని జిల్లాలో గుసాని సమితి లావణ్యగడ పంచాయతీ కార్యాలయంలో జిల్లా న్యాయసేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్‌ రౌళో ఆధ్వర్యంలో శనివారం ప్రారంభించారు. బాల్యవాహాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని బిమల్‌ రౌళో అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక మహిళా పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిబిరం జస్టీస్‌ కార్నర్‌ చారిటబుల్‌ ట్రస్టు, నల్సా జాగృతి యోజన ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా అదాలత్‌ సీనియర్‌ క్యాడర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజేష్‌ కుమార్‌ మిశ్రా, కిశోర్‌ న్యాయలయం బోర్డు సభ్యులు భాగ్యలక్ష్మీనాయక్‌, గారబంద పోలీసు ఎస్‌ఐ అంబికా బెనియా, ఐ.సి.డి.ఎస్‌ సూపర్‌వైజర్‌ తపస్వినీ జెన్నా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement