ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని మంగువారితోటకు చెందిన నానుబాల లలితారా ణి (72) మృతి చెందడంతో ఆమె నేత్రాల ను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. కుమారుడు భవానీప్రసాద్, ఎ.వెంకటరమణ, డోలా వలసయ్యలు విషయాన్ని రెడ్‌క్రాస్‌కు తెలియజేయగా సిబ్బంది వచ్చి కార్నియాలు సేకరించారు. అనంతరం విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్ కోరారు.
టెక్కలి: మార్చి నెలాఖరులోగా వివిధ రకాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. టెక్కలి నియోజకవర్గంలో కొత్తగా రెండు ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి , పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖాధికారులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ అధికారి, అసిస్టెంట్ బీట్ అధికారి, దేవదాయ శాఖ ఎగ్జిక్యూ టివ్ ఆఫీసర్ గ్రేడ్ 3, తానేదర్ ఇన్ ఎ.పి. ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 11 వర కు జరిగే ఈ పరీక్షలకుఅభ్యర్థులు హాల్ టికెట్, ఒరిజినల్ ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డుతో హాజరుకావాలని కోరారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 1375 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, కాలేజీ ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
పలాస: ఉద్దానం ప్రాంతంలో ఆదర్శ విప్లవకారుడు రాజాం గుణవంతు అని పలువురు వక్తలు కొనియాడారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన రాజాం గుణవంతు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో శనివారం సంతాప సభ నిర్వహించారు. బొడ్డపాడు యర్రయ్య అధ్యక్షతన జరిగి న ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ గుణవంతు నాటి శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారని, పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వాన ఉద్దానం ప్రాంతంలో జరిగిన సముద్రం తీర ప్రాంత భూములు పంపిణీలోను, సారా వ్యతిరేక పోరాటంలో, జీడి రైతాంగ గిట్టుబాటు ధర ఉద్యమంలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు దాసరి శ్రీరాములు, తామాడ త్రిలోచన రావు, కిక్కర ఢిల్లీరావు, బొడ్డు సింహాద్రి, కోత ధర్మారావు, ప్రభాకర్, బొడ్డు దుష్యంతు, మద్దిల ధర్మారావు, సాలిన వీరాస్వామి, మెట్టూరు వీరాస్వా మి, పోతనపల్లి కుసుమ, నైగాపు గంగాధర్, బొడ్డు సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
ఆమదాలవలస: జీడిమామిడి సాగుతో గిరిజన రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ డాక్టర్ జి.శివన్నారాయణ అన్నారు. ఆమదాలవలస పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ కాష్యూ నట్ అండ్ కోకో డెవలప్‌మెంట్, కొచ్చిన్ వారి ఆర్థిక సహకారంతో జిల్లా స్థాయి జీడిమామిడి సదస్సును శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జీడిమామిడి గిరిజన రైతులకు ముఖ్య ఆదాయ వనరుగా మారిందని, సరైన సాగు యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.
ఆమె నేత్రాలు సజీవం
ఆమె నేత్రాలు సజీవం


