సాంకేతికతపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

సాంకేతికతపై శిక్షణ

Feb 8 2026 4:22 AM | Updated on Feb 8 2026 4:22 AM

సాంకేతికతపై శిక్షణ

సాంకేతికతపై శిక్షణ

పర్లాకిమిడి: అభివృద్ధి చెందుతున్న సాంకేతికతపై స్థానిక మహరాజా బాలుర ఉన్నత పాఠశాలలో ఐటీశాఖ ప్రభుత్వ ఒడిశా కంప్యూటర్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ఓకాక్‌) భువనేశ్వర్‌ నుంచి విచ్చేసిన నిపుణులు విద్యార్థులకు రోబోటిక్స్‌, కృత్రిమ మేధా, సైబర్‌ సెక్యూరిటీపై శనివారం అవగాహన కల్పించారు ఎమెర్జింగ్‌ టెక్నాలజీ శిక్షణలో ఓకాక్‌ గజపతి హెడ్‌ శ్రీకాంత్‌ మహంతి, అదనపు జిల్లా విద్యాధికారి ఎస్‌.గిరధర్‌, హెచ్‌ఎం మోనాలిసా దాస్‌ పాల్గొని మాట్లాడారు. దైనందిన జీవితంలో రోబోటిక్స్‌ ఎలా ఉపయోగపడతాయో వివిధ రోబోలను ప్రదర్శించారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులు 120 మంది శిక్షణకు హాజరయ్యారు. కృత్రిమ మేధ, సైబర్‌ సెక్యూరిటీపై పలు అంశాలను క్షిరాబ్దితనయ పండా, అశుతోష్‌ శెట్టి, సూరజ్‌ స్వయి వివరించారు. ఉపాధ్యాయులు డి.శ్రీరామ్మూర్తి, శుభశ్రీదర్శిని, ఎం.సత్యనారాయణ, జగన్నాథ పట్నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement