బిసంకటక్‌లో దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని బిసంకటక్‌లో గల బ్రాహ్మణవీధికి చెందిన కై లాస్ చంద్ర సాహు(49) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అతని గొంతు కోసి హత్య చేశారు. రక్తపు మడుగులో ఉన్న సాహుని బిసంకటక్‌లో గల క్రిష్టియన్ ఆస్పత్రికి వెంటనే తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఐఐఈ సూర్యచంద్ర పాఢి హత్య జరిగిన బ్రాహ్మణవీధికి సైంటిఫిక్ బృందంతో చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు. ఎందుకు హత్య చేశారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సముద్రంలో
తల్లీ, కొడుకులు మృతి
భువనేశ్వర్: పూరీ సముద్ర ప్రమాదంలో తల్తీ, కొడుకులు మృతి చెందారు. సముద్రంలో స్నానం చేస్తుండగా ఈ విషాదం చోటు చేసకుంది. స్నానం చేస్తుండగా కెరటాల్లో కొట్టుకుపోతున్న తల్లిని కాపాడబోయిన కొడుకు అలల్లో కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. మృతులు ఇరువురు జార్ఖండ్ రాంచీ ప్రాంతానికి చెందిన అంకిత్ గుప్తా, కుసుమ్ గుప్తాగా గుర్తించారు. పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ప్రత్యక్షంగా ఘటనా స్థలం సందర్శించారు. దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీసు అధికారిని నియమించినట్లు తెలిపారు. ఒడ్డుకు చేర్చిన బాధితులకు సత్వర చికిత్స కల్పించేందుకు పూరీ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
భారీగా గంజాయి పంట ధ్వంసం
జయపురం: సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి పరిధి జి.మఝిగుడ గ్రామ పంచాయతీ బలియపొదర్ ప్రాంతంలో దాదాపు 30 ఎకరాల్లో అక్రమంగా పండిస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు, ఎకై ్సజ్ సిబ్బంది ధ్వంసం చేశారు. దీనిలో భాగంగా బొయిపరిగుడ పోలీసులు 16 ఎకరాల్లో ధ్వంసం చేయగా.. బొయిపరిగుడ ఎకై ్సజ్ సిబ్బంది 14 ఎకరాల్లో గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. గ్రీన్ క్లీన్ అభిజాన్‌లో భాగంగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు వెల్లడించారు.
రాయగడ: స్థానిక రామకృష్ణ నగర్ (ఆర్‌కే)లో నివాసముంటున్న నాల్గో వార్డు కౌన్సిలర్ సుకాంత పొరిడ ఇంటిలో శనివారం సాయంత్రం దోపిడీ జరిగింది. ఏడాది వయసు గల బాలిక మెడపై కత్తి పెట్టిన దుండగులు ఇంటిలోగల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. వివరాల్లొకి వెళితే.. సుకాంత ఇంటిలో తన భార్య, ఏడాది వయసు గల కూతురు ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇద్దరు ముసుగులు ధరించి ఇంటి లోపలకు వెళ్లి పాప మెడపై కత్తిపెట్టి బెదిరించారు. దీంతొ భయపడిన సుకాంత్ భార్య ఇంటిలో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి తదితరమైనవి దుండగులకు ఇచ్చింది. ఇంటిలో బంగారు,వెండి ఆభరణాలు దోచుకున్న దుండగులు పాపను వదిలి ఇంటి వెనుక నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని తన భర్త సుకాంత్ కు ఫోన్ చేసి చెప్పడంతో ఇంటికి చేరుకున్న అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. బాధితుని ఇంటికి చేరుకున్న పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.
బిసంకటక్‌లో దారుణ హత్య
బిసంకటక్‌లో దారుణ హత్య
బిసంకటక్‌లో దారుణ హత్య
బిసంకటక్‌లో దారుణ హత్య


