విలువలు లేని జ్ఞానం అసంపూర్ణం
● డ్రీమ్స్ ద్వితీయ స్నాతకోత్సవ సభలో రాష్ట్ర గవర్నర్ హరిబాబు కంభంపాటి
భువనేశ్వర్: విలువలు లేని జ్ఞానం అసంపూర్ణమని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఉత్తీర్ణ విద్యార్థులకు ప్రబోధించారు. కటక్ నగరంలో శనివారం డ్రీమ్స్ విశ్వవిద్యాలయం ద్వితీయ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అత్యున్నత విద్యార్హతలతో పట్టాలు పొందిన ఉత్తీర్ణులు వ్యక్తిత్వం, విద్యా నైపుణ్యానికి సమాన ప్రాముఖ్యత ఇవ్వాలని కోరారు. నిజాయితీ, సానుభూతి మరియు బాధ్యత వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు మార్గనిర్దేశం చేస్తుందని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ వేడుక మార్గనిర్దేశిత అభ్యాసం నుంచి స్వతంత్ర బాధ్యత, విద్యార్థి జీవితం నుంచి వృత్తిపరమైన పౌర జీవన పరివర్తనను సూచిస్తుందన్నారు.
భారత మాజీ విదేశాంగ కార్యదర్శి లలిత్ మాన్‌సింగ్ భారత దేశ విదేశాంగ విధానం, ప్రపంచ స్థాయికి ఆయన చేసిన విశిష్ట సహకారాన్ని గవర్నర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలైన తులసి ముండా, దమయంతి బేష్రాలకు గవర్నరు గౌరవ డాక్టరేటు ప్రదానం చేశారు. వీరివురు సేవ, విద్య, సామాజిక సంస్కరణ మరియు గిరిజన సంస్కృతి గుర్తింపు, పరిరక్షణకు స్ఫూర్తిదాయకమైన చిహ్నాలుగా అభివర్ణించారు. సాంకేతికత, కృత్రిమ మేధస్సు, వాతావరణ మార్పు, అభివృద్ధి చెందుతున్న సామాజిక వ్యవస్థలో నిర్మాణాల ద్వారా నడిచే వేగవంతమైన ప్రపంచ మార్పులను ప్రస్తావిస్తూ, నిరంతర అభ్యాసం, సత్వర సాధన, సమయ స్ఫూర్తితో బాధ్యతాయుతంగా వ్యవహరించే వారిదే భవిష్యత్తు అని యుతను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంలో, బహుళ విభాగ విద్య, నైపుణ్య అభివృద్ధి, నైతికత మరియు సమగ్ర వృద్ధితో యువతను 21వ శతాబ్దపు సవాళ్లకు సిద్ధం చేయడానికి జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020ని ఒక దార్శనిక చొరవగా పేర్కొన్నారు.
నిరంతర అభ్యాసంతో వైఫల్యాలను సమర్థంగా ఎదుర్కొని వినయపూర్వక విజేతలుగా నైపుణ్యతను విస్తృత ప్రయోజనాలకు సద్వినియోగపరచడంతో వికసిత్ ఒడిశా, వికసిత్ భారత్ దార్శనికతకు దోహదపడాలని విద్యార్థులకు గవర్నర్ పిలుపునిచ్చారు. భారత మాజీ విదేశాంగ కార్యదర్శి లలిత్ మాన్‌సింగ్, డ్రీమ్స్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రకాష్ కుమార్ హొత్తా ఈ సందర్భంగా ప్రసంగించారు.
విలువలు లేని జ్ఞానం అసంపూర్ణం
విలువలు లేని జ్ఞానం అసంపూర్ణం
విలువలు లేని జ్ఞానం అసంపూర్ణం


