నేడు సీఎం రాయగడ పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు సీఎం రాయగడ పర్యటన

Feb 2 2026 7:19 AM | Updated on Feb 2 2026 7:19 AM

నేడు సీఎం రాయగడ పర్యటన

నేడు సీఎం రాయగడ పర్యటన

రాయగడ: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి సోమవారం రాయగడలో పర్యటించనున్నారు. ఉదయం 9.55 గంటలకు సీఎం నివాసం నుంచి ఆయన బయలుదేరి పది గంటలకు బిజూ పట్నాయక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం 11.30 గంటలకు స్థానిక జేఎస్‌కో మైదానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు వస్తారు. అక్కడ నుంచి 11.40 గంటలకు మైదానం సమీపంలో గల 108 కుండీల మహా విశ్వశాంతి యజ్ఞంలో పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12.20 గంటలకు శుభద్ర శక్తి మేళా–26ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం మైదానంలోని శుభద్ర స్టాల్‌లను పరిదర్శించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించిన భూమి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా రాయగడ జిల్లా కలెక్టర్‌ అశుతోస్‌ కులకర్ణి, జిల్లా ఎస్పీ స్వాతి ఎస్‌ కుమార్‌లు వేదికను ఆదివారం పరిశీలించారు. పోలీస్‌ బందోబస్తుపై సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement