రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ప్రారంభం
భువనేశ్వర్:
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక వైమానిక దళ విమానంలో సోమవారం సాయంత్రం స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఆమె ఆరు రోజుల రాష్ట్ర పర్యటన ఆరంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ రాష్ట్రపతిని గౌరవపూర్వకంగా స్వాగతించారు. రాష్ట్రపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి లోక్‌భవన్ చేరుకున్నారు. సోమ వారం రాత్రి లోక్ భవన్‌లో బస చేశారు. ఆమె ఈ పర్యటనలో భాగంగా మంగళవారం జాజ్‌పూర్ సందర్శించి విరజామాత ఆలయంలో పూజలు చేస్తా రు. అనంతరం నాభి గయ ప్రాంగణంలో తన పూర్వీకులకు పిండదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు గంటన్నరకు పైగా రాష్ట్రపతి ఆలయంలో గడుపుతారు. అక్కడ నుంచి బాలాసో ర్ సందర్శించి ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఆమె పూరీ చేరుకుని రాత్రికి బస చేస్తారు. ఈనెల 4 బుధవారం ఆమెను గజపతి మహారాజు మరియు అధికారులు శ్రీ జగన్నాథ ఆలయ సింహ ద్వారం ఆవరణలో స్వాగతిస్తారు. శ్రీ జగన్నాథుడిని ప్రార్థించిన తర్వాత రాష్ట్రపతి శ్వేత గంగ తీరంలో పితృదే వతలకు పిండ దానం చేస్తారు. అదే రోజు ఆమె మయూర్‌భంజ్‌లోని రాయరంగ్‌పూర్‌కు వెళ్లి బహి రంగ సభలో ప్రసంగించి, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. మరుసటి రోజు ఆమె రాయరంగ్‌పూర్‌లోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించి జషిపూర్ మీదుగా సిమిలిపాల్ పులుల అభయారణ్యం చేరి రాత్రికి బస చేస్తారు. ఈ సందర్భంగా సిమిలి పాల్ ప్రాంతానికి చెందిన గిరిజన మహిళలు,యువతతో రాష్ట్రపతి ముఖాముఖి సంభాషిస్తారు.
నగరంలో భద్రత కట్టుదిట్టం
భువనేశ్వర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రప తి ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆమె పర్యటన ముగిసేంత వరకు ఈ ఆంక్ష లు నిరవధికంగా కొనసాగుతాయి. రాష్ట్రపతి భద్ర తా ఏర్పాట్లలో భాగంగా రాష్ట్ర రాజధానిలో 30 ప్లాటూన్ల పోలీసు బలగాలతో 4 మంది డీసీపీ స్థాయి అధికారులు, 5 మంది అదనపు డీసీపీలు, 23 మంది ఏసీపీలు, 33 మంది ఇన్‌స్పెక్టర్లు, 121 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, సహాయ సబ్ ఇన్‌స్పెక్టర్లు స్థాయి సిబ్బందిని మోహరించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ప్రారంభం


