బడ్జెట్‌ ప్రజాప్రయోజనాలకు విరుద్ధం | - | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ ప్రజాప్రయోజనాలకు విరుద్ధం

Feb 3 2026 7:13 AM | Updated on Feb 3 2026 7:13 AM

బడ్జెట్‌ ప్రజాప్రయోజనాలకు విరుద్ధం

బడ్జెట్‌ ప్రజాప్రయోజనాలకు విరుద్ధం

బడ్జెట్‌ ప్రజాప్రయోజనాలకు విరుద్ధం

జయపురం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026– 27 బడ్జెట్‌ దేశం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే స్థితిలో లేదని రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యుడు, ప్రముఖ కార్మిక నేత ప్రమోదకుమార్‌ మహంతి వ్యాఖ్యానించారు. సోమవా రం కేంద్ర బడ్జట్‌పై విలేకర్లతో మాట్లాడారు. ఇది దేశ ప్రజల ప్రయోజనాల కు విరుద్ధంగా, కార్మికులు, రెతులు, యువత, విద్యార్థుల వ్యతిరేక బడ్జెట్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ– ఆర్థిక అనిశ్చిత, వాణిజ్య అడ్డంకులు పెరుగుతున్న ఈ సమయంలో ఆర్థిక మంత్రి ప్రసంగం మన ఆర్థిక వ్యవస్థను రక్షించటానికి, ప్రజల జీవన భద్రతను కాపాడటానికి స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వలేక పోయిందన్నారు. స్పష్టతకు బదులుగా బడ్జెట్‌ అస్పష్టత నిండి ఉంద న్నారు. పథకాల వారీగా నిధులు కేటాయించడంలో పారదర్శకత లోపం కనిపిస్తుందని విమర్శించారు. దేశ అభివృద్ధికి ప్రధాన ఆధారం దేశీయ వినియోగ మని చెపుతున్న కేంద్ర ప్రభుత్వం, దేశీయ వినియోగం పెంచేందుకు బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు లేవని నిందించారు. గ్రామీణ జీవన భద్రతకు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం నిర్వీర్యం చేస్తున్నార ని ఆరోపించారు. బడ్జెట్‌లో ప్రజల ఆరోగ్యం, విద్యా రంగాలను నిర్లక్ష్యం చేశారన్నారు. ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో మన దేశం ఎ–వన్‌ అనే పదాన్ని 11 సార్లు ప్రస్తావించినా అన్ని రంగా ల్లోనూ వెనుకబడే ఉందన్నారు. ప్రజావ్యతిరేక బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన చేపడుతున్న అఖిల భారత్‌ సాధారణ సమ్మెను విజయవంతం చేయాలని తమ పార్టీ పిలుపునిచ్చిందని మహంతి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement