ఒడిశాలో రైల్వేకు చరిత్రాత్మక కేటాయింపులు: మంత్రి
● రూ. 10,928 కోట్లు కేటాయింపు
భువనేశ్వర్: 2026–27 కేంద్ర బడ్జెట్‌లో ఒడిశాలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ కోసం చారిత్రాత్మక కేటాయింపులు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి తూర్పు కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం నుంచి జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కేటాయింపులు తూర్పు భారత దేశంలో రైలు ఆధారిత అభివృధ్దిని వేగవంతం చేయడంలో భారత ప్రభుత్వం బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. 2026–27లో ఒడిశాకు వార్షిక సగటు రైల్వే కేటాయింపులు రూ. 10,928 కోట్లకు పెరిగిందని మంత్రి తెలియజేశా రు. రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలలో భారీ పరివర్తన లక్ష్యంగా ఏటా రైల్వే రంగంలో బడ్జె టు కేటాయింపులు గణనీయంగా పెంచుతున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ. 90,659 కోట్లకు పైగా పనులు పురోగతిలో ఉన్నా యన్నారు. వీటిలో కొత్త లైన్ నిర్మాణం, డబ్లింగ్, సామర్థ్యం పెంపుదల, స్టేషన్ పునరాభివృద్ధి, కీలకమైన భద్రతా మెరుగుదల తదితర ప్రాజెక్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఒడిశాలోని మారు మూల ప్రాంతాలకు మెరుగైన రైలు అనుసంధానంతో సమగ్ర వృద్ధి దిశలో రైల్వే శాఖ ప్రాధాన్యత కల్పి స్తుంది. ప్రయాణికుల కేంద్రీకృత కార్యక్రమాల్లో భాగంగా అమృత్ స్టేషన్ పథకం కింద ఒడిశాలో 59 స్టేషన్లను రూ. 2,439 కోట్ల పెట్టుబడితో సమగ్ర పునరాభివృద్ధి కోసం గుర్తించినట్లు ప్రకటించారు. ఆధునిక రైలు సేవలను ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో రైలు అనుసంధానం గుణాత్మక పురోగతిని సాధించిందని రైల్వే మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఒడిశాలో 6 జతల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవి వేగవంతమైన, సురక్షితమైన మరియు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాలను ప్రజలకు అందిస్తున్నాయి. నెట్‌వర్క్ విస్తరణ కీలకమైన అంశంగా రాష్ట్రంలో 100 శాతం రైలు విద్యుదీకరణ పూర్తయ్యింది. ఇది ఇంధన సామర్థ్యం, పర్యావరణ స్థిరత్వానికి దోహదపడుతుందని మంత్రి అన్నారు. కవచ్ వంటి అధునాతన భద్రతా వ్యవస్థలు క్రమంగా అమలు జరుగుతున్నాయి. రైళ్ల నిర్వహణలో భద్రతను మరింత బలోపేతం చేఏందుకు రైల్వే శాఖ కట్టుబడి ఉందన్నారు.
ఈ మైలురాయి చొరవలు ప్రపంచ స్థాయి రైలు మౌలిక సదుపాయాలు, మెరుగైన ప్రయాణికుల అనుభవం, లాజిస్టిక్స్ సామర్థ్యాల ద్వారా ఒడిశాను కీలకమైన వృద్ధి ఇంజిన్‌గా మార్చాలనే రైల్వేల దార్శనికతను అద్దం పడతాయని రైల్వే మంత్రి పేర్కొన్నారు. ఇది రాష్ట్ర దీర్ఘకాలిక సామాజిక ఆర్థిక అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం
వ్యక్తం చేశారు.
ఒడిశాలో తూర్పు–పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ నిర్మితం అవుతుంది. ఈ కారిడార్ పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభమై ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ గుండా వెళుతుంది.
ఏనుగుల భద్రత కోసం రైల్వే బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. రైలు ఢీకొనడం వల్ల ఏనుగుల మరణాలను నివారించడానికి రైల్వే శాఖ ఈ అడుగు వేసిందన్నారు. ఏనుగుల భద్రత కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత థర్మల్ కెమెరాలను ప్రారంభించబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్వని ౖవైష్ణవ్ తెలిపారు. ఏనుగుల సంచారం ప్రభావిత ప్రదేశాలలో ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటు అవుతుంది. ఏనుగుల సురక్షిత కదలిక కోసం భూగర్భ రోడ్లు నిర్మిస్తారు. దేశ వ్యాప్తంగా 200 ప్రదేశాలలో భూగర్భ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు.
ఒడిశాలో రైల్వేకు చరిత్రాత్మక కేటాయింపులు: మంత్రి


