పోషకాహారం అందించడమే లక్ష్యం
పర్లాకిమిడి: నీతి ఆయోగ్, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గజపతి జిల్లాలో సంపూర్ణతా అభియా న్ 2 ఓను జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం సాయంత్రం లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్, కన్వర్జెన్స్, డిప్యూటీ డైరెక్టర్ ప్రకాశ్ రౌతో, జిల్లా పరిషత్ అదనపు కార్యనిర్వాహణ అధికారి పృథ్వీరాజ్ మండల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంశుమాన్ మహాపాత్రో తదితరులు హాజరయ్యారు. గజపతి జిల్లాలో ఆకాంక్ష సమితి కేంద్రాల్లో ఈ సంపూర్ణతా అభియాన్ 2ఓ కార్యక్రమం ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్న ట్టు కలెక్టర్ తెలియజేశారు. ఆర్.ఉదయగిరి, గుమ్మా సమితి కేంద్రాల్లో అందరికీ ఆరోగ్యం, విద్య, కృషి, బాలలకు మంచి పోషక ఆహారం అందించాలని జిల్లాలోని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఐ.సి.డి.ఎస్ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. గుమ్మలో 90.7 శాతం, ఆర్.ఉదయగిరిలో 78.9 శాతం మాత్రమే మౌలిక సదుపాయాలు అందిస్తు న్నారని, శత శాతం లక్ష్యం చేరుకోవాలని ఆదేశించారు. ఏప్రిల్ 14వ తేదీలోగా గుమ్మ, ఆర్.ఉదయగిరిలో సంపూర్ణతా అభియాన్ పూర్తిచేయాలని కలెక్టర్ అన్నారు. ప్రతీ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, శానిటేషన్ పనులు త్వరితగతిని పూర్తి చేసి కేంద్ర నీతి ఆయోగ్ ద్వారా ఆవార్డు అందేందు కు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా ముఖ్యశిక్షాధికారి డాక్టర్ మయాధర్ సాహు, జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి ఎం.ప్రకాశరావు, పిరమల్ ఫౌండేషన్ ప్రతినిధి దేబబ్రతా ఆచార్య, ఆకాంక్ష బ్లాక్ ఫెలో కన్హుచరణ్ పాణిగ్రాహి, గుమ్మా బప్పి కిశోర్ దిగాల్, రిసోర్స్ పర్సన్ దేవేంద్ర కోరో, డీడబ్ల్యూఓ రైకా, తదితరులు పాల్గొన్నారు.


