బడ్జెట్‌పై సమాలోచనలు
● వివిధ రంగాలకు చెందిన 50 మందికి పైగా నిపుణులు హాజరు
భువనేశ్వర్: ప్రభుత్వ బడ్జెట్ తయారీ ప్రక్రియ సచివాలయం నుంచి ప్రజల వద్దకు చేరుకుంది. ప్రజల నుంచి వారి విలువైన అభిప్రాయాలకు పట్టం గట్టే రీతిలో జాగ్రత్తగా పరిశీలించి, విశ్లేషించిన తర్వాత బడ్జెట్‌లో ప్రవేశ పెడుతున్నారు. ప్రభుత్వం ప్రజల బడ్జెట్ రూపకల్పనలో భాగంగా ఈ సన్నాహం చేస్తుందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన అధ్యక్షతన బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశం జరిగింది. లోక్ సేవా భవన్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశంలో పలు రంగాల నిపుణులు, పౌర సమాజం ప్రముఖులు, వివిధ రంగాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల గురించి చర్చించారు. ఇటీవల ప్రారంభించిన ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజనను ప్రజల అభిప్రాయం నుంచి సేకరించి అమలు చేసినట్లు ఉదహరించారు. అలాగే అమలు చేయబోయే శ్రీ జగన్నాథ్ దర్శన్ కార్యక్రమం, కటక్, భువనేశ్వర్, పారాదీప్, పూరీ ఆర్థిక ప్రాకారం ప్రాజెక్ట్ ప్రజా అభిప్రాయం నుంచి వెలుగు చూసిన అంశాలుగా వివరించారు. ప్రజా అభిప్రాయం ఆధారంగా విధానాలు, ప్రణాళిక కార్యక్రమాలలో అవసరమైన మార్పులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ వివిధ కార్యక్రమాలు, ప్రణాళికలు మరియు ప్రకటనలకు సంబంధించి పలు వర్గాల అభిప్రాయాలు, సూచనలను ఆహ్వానించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ, ఉద్యోగ సృష్టి, ఆర్థిక వృద్ధికి ఊతం పొందింది. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా ఆధారిత కార్యక్రమాలు, మహిళలు, రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచాయి. 2026–27 కేంద్ర బడ్జెట్‌లో కూడా రాష్ట్రంలో అనేక చర్యలు ప్రకటించారు. 2026–27 బడ్జెట్ తయారీకి వెబ్ పోర్టల్స్, ఈ–మెయిల్, ఎస్‌ఎంఎస్, వాట్సాప్ ద్వారా పెద్ద సంఖ్యలో ఆలోచింపజేసే సూచనలు వెల్లువలా దాఖలు అవుతున్నాయి. ప్రజా ప్రభుత్వంలో ప్రజల అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించనున్నారు. సమావేశంలో అందిన సూచనలన్నింటినీ రికార్డ్ చేసి లోతుగా ఆలోచించి పరిగణించాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. మాజీ ఆర్థిక మంత్రి ప్రఫుల్ల ఘొడై, నిరంజన్ పూజారి, మాజీ ఆర్థిక కార్యదర్శి అర్ధేందు షడంగి, ఏకే త్రిపాఠి, ఆర్‌ఎన్ శతపతి, ఒడిశా వ్యాపారవేత్తల సమాఖ్య, ఒడిశా యువ పారిశ్రా
మికవేత్తల సమాఖ్య, ఎన్జీఓ సభ్యులు, ఫిన్‌టెక్ సీఈఓలు, వివిధ రంగాలకు చెందిన సామాజిక కార్యకర్తలు, క్రెడాయ్ ఉపాధ్యక్షురాలు, సీనియర్ రాజకీయ నాయకులు శారద శతపతి, అనిల్ శర్మ, మనోజ్ మహా పాత్రో, వివిధ రంగాలకు చెందిన 50 మందికి పైగా ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా, ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్, అభివద్ధి కమిషనర్ డీకే సింగ్, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి శాశ్వత్ మిశ్రా, ఆర్థిక కార్యదర్శి సంజీబ్ కుమార్ మిశ్రా మరియు ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
బడ్జెట్‌పై సమాలోచనలు


