భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు

Jan 30 2026 6:55 AM | Updated on Jan 30 2026 6:55 AM

భక్తి

భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు

రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కళ్యాణవేంకటేశ్వర ఆలయంలొ భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని గురువారం విశేష పూజలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారికి సుప్రభాతసేవ, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమా సత్యసత్యనారాయణ వ్రత పూజలు కూడా చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు.

పర్లాకమిడిలో..

పర్లాకిమిడి: భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని కోమటివీధి శ్రీవేంకటేశ్వర ఆలయంలో గరుడ వాహానంపై తిరువీధి ఉత్సవం జరిగినది. ఈ ఉత్సవంలో వేంకటేశ్వర స్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు (రాజమండ్రి) డాక్టర్‌ పి.భారతీ రామారావు దంపతులు, పి.మంగమ్మ పాల్గొన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని భద్రంకృష్ణ మోహనా చార్యులు, భద్రం శ్రీనివాసాచార్యులు, చక్రధర్‌ నిర్వహించారు. శ్రీవారి వార్షిక కల్యాణ మహోత్సవాలు రాత్రి ఎనిమిది గంటల సమయలో జరిగాయి. అలాగే కేవుటి వీధి శ్రీ ప్రసన్న వేంకటేశ్వర ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి తిరువీధి ఉత్సవం జరిపారు. ఈ ఉత్సవంలో ప్రధాన అర్చకులు ఎ.రాజగోపాలచారి పాల్గొన్నారు. అలాగే రాజవీధి జగన్నాథ మందిరం వద్ద ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని భక్తులు దీపారాధన చేసి బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వాములను దర్శించుకున్నారు. ఈ రోజు నుంచి ప్రత్యేక యజ్ఞం ప్రారంభించారు.

భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు 1
1/6

భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు

భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు 2
2/6

భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు

భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు 3
3/6

భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు

భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు 4
4/6

భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు

భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు 5
5/6

భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు

భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు 6
6/6

భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement