సెంచూరియన్‌లో మంజర్ 4.ఓ ‘డాటాథాన్’ పోటీలు
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో మేనేజ్‌మెంట్ ఫెస్ట్ ’మంజర్ 4.ఓ’ రెండో రోజును రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్రో ప్రారంభించారు. కార్యక్రమానికి అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ప్రజ్ఞా పాణి, డీన్ (స్టూడెంట్స్) డాక్టర్ సుశాంత్ పట్నాయిక్, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు యం.సుదర్శనరావు, తదితరులు పాల్గొన్నారు. మంజర్ 4.ఓ లో పర్లాకిమిడితో పాటు భువనేశ్వర్ సీఐటీఎం, విజయనగరం కళాశాల ఇంటెల్ విజ్, ఎంబీఏ, సెంచూరియన్ విద్యార్థులు ‘డేటాథాన్’ ప్రాజెక్టులను ప్రజెంట్ చేశారు. పోటీలో విజేతలకు రూ.5 వేలను సెంచూరియన్ వర్సిటీ మేనేజ్‌మెంట్ బహుమతిగా విజయనగరం క్యాంపస్ ఇంటెల్ విజ్ బృందానికి అందజేశారు.
సెంచూరియన్‌లో మంజర్ 4.ఓ ‘డాటాథాన్’ పోటీలు


