శివరాత్రి ఉత్సవాలకు మూహూర్తపు రాట | - | Sakshi
Sakshi News home page

శివరాత్రి ఉత్సవాలకు మూహూర్తపు రాట

Feb 5 2026 7:15 AM | Updated on Feb 5 2026 7:15 AM

శివరా

శివరాత్రి ఉత్సవాలకు మూహూర్తపు రాట

రాయగడ: అత్యంత పురాతన మందిరంగా గుర్తింపు పొందిన స్థానిక బాలింకేశ్వర మందిరంలో ఈ నెల 16వ తేదీ నుంచి జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి బుధవారం మూహూర్తపు రాట పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ ప్రముఖులు పెద్దిన ఆనందరావు, గోపరంజన్‌ బక్షీపాత్రో, సస్మిత బక్షీపాత్రో, డాక్టర్‌ సౌదామిని ఆచార్య, హరిహర దాస్‌, దేవాశీష్‌ బక్షీపాత్రో, ప్రియాంక బక్షీ పాత్రో దంపతులు పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా మందిర ప్రాంగణంలో విశ్వశాంతి త్రయంబకం మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు వైభవంగా జరుగుతాయన్నారు.

మధుసూదన్‌దాస్‌కు

ఘన నివాళులు

రాయగడ: స్థానిక రింగ్‌ రోడ్డులోని యూజీఎంఐటీలో ఉత్కళ గౌరవ్‌ మధుసూదన్‌ దాస్‌ 92వ వర్ధంతిని బుధవారం జరుపుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రదీప్‌ కుమార్‌ ఖటువ, ఎంఎస్‌రావు, జిల్లా పారిశ్రామిక కేంద్ర విశ్రాంత అడ్మినిస్ట్రేటర్‌ సబ్యసాచి సాహు, లెక్చరర్‌ ప్రతిభా పాత్రో, శ్రీకాంత్‌ ఠాకూర్‌, కె.సుమన్‌రావు, గీతాంజలి పండ, దీపక్‌ కుమార్‌ నాయక్‌ తదితరులు మధుసూదన్‌ దాస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఒడిశా రాష్ట్రానికి మధుసూదన్‌ దాస్‌ చేసిన సేవలను వక్తలు కొనియాడారు.

శివరాత్రి ఉత్సవాలకు మూహూర్తపు రాట 1
1/1

శివరాత్రి ఉత్సవాలకు మూహూర్తపు రాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement