ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి రాయగడ పర్యటన
రాయగడ: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఫిబ్రవరి 2 వ తేదీన రాయగడలో పర్యటించనున్నారు. ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఆయన రాయగడకు చేరుకుంటారు. స్థానిక జేఎస్‌కో మైదానం అందుకు సిద్ధమవుతోంది. మైదానంలో ఏర్పాటు చేసిన సుభద్ర మేళాను ఆయన ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 8 వ తేదీ వరకు జరిగే సుభద్ర మేళాలో మహిళలు, స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు పాల్గొంటారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఎంతగానో దోహదపడే సుభద్ర పథకం గురించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అదేవిధంగా సమీపంలో జరుగుతున్న 108 కుండీల విశ్వవైదిక విశ్వశాంతి దేవ మహాయజ్ఞ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడ జరిగే పూజల్లో పాల్గొంటారు. ఆయన పర్యటన వివరాలు అధికారికంగా ఇంకా ఖరారు కానప్పటికీ అందుకు సంబంధించిన సన్నాహాలు యుద్ధప్రాదిపదికన జరుగుతున్నాయి.
ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి రాయగడ పర్యటన
ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి రాయగడ పర్యటన


