నివేదిక సమర్పణ | - | Sakshi
Sakshi News home page

నివేదిక సమర్పణ

Jan 30 2026 6:55 AM | Updated on Jan 30 2026 6:55 AM

 నివే

నివేదిక సమర్పణ

ముఖ్యమంత్రికి

6వ రాష్ట్ర ఆర్థిక సంఘం

భువనేశ్వర్‌: ఆరో రాష్ట్ర ఆర్థిక సంఘం తుది నివేదికను లోక్‌ సేవా భవన్‌లో ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝికి సమర్పించారు. కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌ పండా ముఖ్యమంత్రికి నివేదిక ముఖ్యాంశాలను వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమీక్ష పోర్టల్‌ను ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ), కేంద్ర ఆర్థిక సంఘం (సీఎఫ్‌సీ) గ్రాంట్‌ల కింద రోడ్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, ఉద్యానవనాలు, ప్రజా వినియోగాలు వంటి ప్రాజెక్టుల అమలు పురోగతి గురించి ఈ పోర్టల్‌ తాజా సమాచారాన్ని అందిస్తుంది. పౌరులు, ఎన్నికై న ప్రతినిధులు లేదా ఎవరైనా htt pr:// ramikrh ya.odirha.gov.in లింక్‌ ద్వారా పోర్టల్‌ను యాక్సెస్‌ చేయవచ్చు. ప్రాజెక్టుల అమలు పురోగతిని పర్యవేక్షించవచ్చు. సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక ప్రమాణాలను మెరుగుదల పంచాయతీ స్థాయి పటిష్టత, ప్రజల జీవన ప్రమాణాల పురోగతి, ప్రతి గ్రామం, పట్టణ ప్రాంతం యొక్క పరిస్థితిని మెరుగుపరిచి సంపన్న ఒడిశా సంకల్పం బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. కమిషన్‌ సమర్పించిన నివేదికలో స్థానిక సంస్థల ఆర్థిక మౌలిక సదుపాయాలను నిర్ధారిత ప్రణాళిక ఆధారిత వ్యవస్థ ద్వారా బలోపేతం చేయడంపట్ల నివేదిక దృష్టి సారించింది. సమానత, ప్రాంతీయ అసమానతలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల విభిన్న అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని నివేదిక ప్రత్యేకంగా సూచించింది. స్థానిక సంస్థల సమగ్ర అభివృద్ధికి కమిషన్‌ ఆర్థిక మరియు ఆర్థికేతర సిఫార్సులను చేసింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కనక్‌ వర్ధన్‌ సింగ్‌ దేవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూ గర్గ్‌, అభివృద్ధి కమిషనర్‌ దేవరంజన్‌ కుమార్‌ సింగ్‌, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ కార్యదర్శి శాశ్వత్‌ మిశ్రా, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సంజీవ్‌ మిశ్రా, ఎలక్ట్రానిక్స్‌, సాంకేతిక సమాచార శాఖ కార్యదర్శి విశాల్‌ దేబ్‌, పంచాయతీ రాజ్‌, తాగునీటి శాఖ కార్యదర్శి గిరీష్‌ ఎస్‌. ఎన్‌. 6వ రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ) సభ్యులు ప్రొఫెసర్‌ అసిత్‌ రంజన్‌ మహంతి, డాక్టర్‌ బిభు ప్రసాద్‌ నాయక్‌, సభ్య కార్యదర్శి డాక్టర్‌ సత్య ప్రియాంక రథ్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సభ్యుడు, డైరెక్టర్‌ అరిందం డకువా కార్యక్రమానికి హాజరయ్యారు.

 నివేదిక సమర్పణ 1
1/1

నివేదిక సమర్పణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement