చట్టాలపై అవగాహన
పర్లాకిమిడి: ట్రాన్స్‌జెండర్స్, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై స్థానిక జిల్లా పరిషత్ హాలులో గురువారం ఉదయం జిల్లా న్యాయ సేవా ప్రాధికరణ కార్యదర్శి బిమల్ రవుళో ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జాతీయ లీగల్ ఎయిడ్ హెల్ప్‌లైన్ ‘15100’కు డయల్ చేసి ఉచిత న్యాయ సలహా పొందవచ్చని లీగల్ సర్వీసెస్ కార్యదర్శి బిమల్ రవుళో అన్నారు. కార్యక్రమంలో అదాలత్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార మిశ్రా, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు అలోక్ కుమార్ బోస్, న్యాయవాది ఇతిశ్రీ మహాపాత్రో, అఖిల భారత యువజనసేన సమితి అధ్యక్షులు కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొని వివిధ చట్టాలపై చర్చించారు.


