అవస్థల నడుమ..
శ్వేతగిరిపై సంతాన వేణుగోపాలుడి సంబరం అంబరాన్ని తాకింది. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా కొండపై నుంచి భక్తజనధార జీవనదిలా కదిలి వంశధారలో లీనమైంది. చక్రతీర్థ స్నానం సందర్భంగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న నదికి రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలుడితో పాటు లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవమూర్తులు పల్లకిలో కన్నుల పండువలా కదిలి వెళ్లాయి. వేలాదిగా భక్తులు అక్కడే స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. భక్తులను అదుపు చేయలేకపోవడం, నదిలో బారికేడ్లు సక్రమంగా నిర్వహించకపోవడం వంటి లోపాలు కనిపించాయి. జాతరలో తోపులాటలూ తప్పలేదు. గుడి నుంచి కింద వరకు ఉన్న 300 మెట్లు నిండా భక్తులతో నిండిపోవడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. క్యూలైన్ సమీపంలోని మెట్లు వద్ద ఆరుగురు వృద్ధులు కింది పడిపోవడంతో హాహాకారాలు మిన్నంటాయి. ఇన్ని అవరోధాలు దాటుకుని భక్తులు స్వామిని దర్శించి తరించారు. – గార
శాలిహుండం యాత్రలో సారవకోట గ్రామానికి చెందిన తూలుగు కాంతమ్మ మెట్ల మార్గం వద్ద కుప్పకూలింది. పోలీసులు వెంటనే ప్రాథమిక చికి త్స అందించగా, సమీపంలోనున్న కిమ్స్ సిబ్బంది వైద్య చికిత్స అందించారు. అరగంట తర్వాత స్వా మి దర్శనం చేయాలని పట్టుపట్టగా ఇప్పటికీ 90 బై 60 బీపీ ఉందని వెళ్లడం అంత మంచిది కాదని తెలిపారు. అదేవిదంగా కొండ మీద రాళ్ల దారుల గుండా ఇష్టానుసారంగా నడిచిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. తోపులాటలో మరికొంత మందికి స్వల్ప అస్వస్థతకు గురికాగా, పలు సంస్థల ఆరోగ్య శిబిరాల వద్ద చికిత్స పొందారు. మూడేళ్ల చిన్నారికి ఆరోగ్య సమస్య రావడంతో వెంటనే చికిత్స చేశారు.
● తీర్థస్నానం తర్వాత భక్తుల రద్దీ పెరిగింది.
● గుడి నుంచి కింద వరకు ఉన్న 300 మెట్లు నిండా భక్తులతో నిండిపోవడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది.
● క్యూలైన్ సమీపంలోని మెట్ల వద్ద ఆరుగురు వృద్ధులు కింద పడిపోవడంతో హహాకారాలు మిన్నంటాయి. తొక్కిసలాటలో పోలీసులు కూడా ఇరుక్కున్నారు.
● భక్తుల తాకిడితో ఉదయం 10.30 తర్వాత ఈ యాత్రకు కేటాయించిన బస్సులు కూడా ఆపేశారు.
● వంశధార నుంచి నడిచివచ్చిన భక్తులు ఎక్కువమంది ఉపవాసం ఉంటారు. కొండపైకి వచ్చాక తాగునీరు పంపిణీ ప్రారంభించలేకపోవడంతో భక్తులు మండిపడ్డారు.
● దాదాపు రెండు లక్షల మంది భక్తులకు ఒక్క మరుగుదొడ్డి కూడా ఏర్పాటు చేయలేదు.
అవస్థల నడుమ..
అవస్థల నడుమ..


