ఒడిశా శతాబ్ది ఉత్సవాలపై సెమినార్
జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ‘సామాజిక విజ్ఞానంలో ఒడిశా శతాబ్ది కాల వికాశం, ప్రయోగం, సమస్యలపై జాతీయ సెమినార్ నిర్వహించారు. కొత్త విద్యా నీతిలో ప్రాంతీయ భాష ప్రాధాన్యత, మాతృ భాష వ్యవహారంపై అఽతిథులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
విశ్వవిద్యాలయ ఫిలాసఫీ అధ్యాపకులు కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో రచించిన పుస్తకం ‘ఫిలాసఫీ ఆఫ్ విట్‌జెనిస్ట్‌యిన్, లేంగ్వేజి, లాజిక్ అండ్ మైండ్’ని అతిథులు ఆవిష్కరించారు. విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఫ్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర, విశ్వవిద్యాలయ రిజిస్టార్ మహేశ్వర చంధ్ర నాయిక్,సి.ఎస్.టి.టి ప్రభుత్వ కమీషనర్ డాక్టర్ సంతోష్ కుమార్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కెప్టెన్ డాక్టర్ లక్ష్మణ పాత్రో మొదలగు వారు పాల్గొన్నారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో నెహ్రూ యువకేంద్రం వేదికగా ఈనెల 31వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తు న్నట్టు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ తెలి పారు. జాబ్‌మేళాలో ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ కంపెనీ, జయభేరి ఆటోమోటివ్ సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నా రు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన సీ్త్ర, పురుషులు అర్హులన్నారు. కనీసం టెన్త్‌క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటలకు తమ బయోడేటా, ఆధార్‌కార్డు, సర్టిఫికెట్లు తీసుకురావాలని సుధ సూచించారు.
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర దేవదాయ శాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజాశంకర్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు చేయించారు.
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలో ఆర్‌పీఎఫ్ బ్యారెక్స్ పక్కన సరుబుజ్జిలి మండలం, సవలాపురం జంక్షన్‌కు చెందిన కొల్ల సింహాచలం (58) మృతి చెందారు. మృతుడు బుధవారం ఉదయం ఆ ప్రాంతానికి వాష్ రూమ్ కోసం వెళ్లి అక్కడే పడిపోయి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు 108కు ఫోన్ చేసి చెప్పగా వారు వచ్చి పరిశీలించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారణ చేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ విషయం రైల్వే పోలీసులు దృష్టికి వెళ్లినప్పటికీ ఆ ప్రాంతం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందని వారు పట్టించుకోకుండా విడిచిపెట్టినట్లు తెలిసింది. పోలీసులకు సమాచా రం రావడంతో గురువారం ఎస్‌ఐ ఎస్.బాలరాజు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి మృతుని జేబు లో ఉన్న ఆధార్ కార్డు ద్వారా సమాచారం తెలుసుకొని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీమ్‌తో పరిశీల న జరిపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అభివృద్ధి చెందిన భారత్ దిశగా ధనిక్ భారత్ విద్యా ఉద్యమం జరుగుతోందని ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత అన్నారు. ధనిక్ అనే భావన కేవలం ఆర్థిక సంపదకే పరిమితం కాకూడదని అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఆమె గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సులువుగా ఐఏఎస్ ఎలా అవ్వాలనే దానిపై అవగాహన కల్పించారు. ఒత్తిడి లేని విద్య ద్వారానే అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడం జరుగుతుందన్నారు. క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, జీవిత లక్ష్యం స్పష్టత పెంపొదించవచ్చన్నారు. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కేవలం చదువు మాత్రమే కాదని మేథస్సు నైతికత, భావోద్వేగ పరిపక్వత, జీవణ నైపుణ్యాల సమగ్ర వికాశమే ధనిక భారత్ లక్ష్యమన్నారు.
ఒడిశా శతాబ్ది ఉత్సవాలపై సెమినార్


