కమ్యూనిస్టు నేతల నిధుల సేకరణ
జయపురం: భారతీయ కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం, నిధుల సేకరణ కొరాపుట్ జిల్లా నాయకులు గురువారం నుంచి ప్రచారం చేపట్టింది. కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా కొరాపుట్ సబ్‌డివిజన్ దసమంతపూర్ సమితిలోను, జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితిలోను ప్రచారం ప్రారభించారు. కొట్‌పాడ్ సమితిలో బతాసన గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయంత్ దాస్, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రమోద్ కుమార్ మహంతి, కొరాపుట్ జిల్లాపార్టీ కార్యదర్శి రామకృష్ణ దాస్, జోనల్ కార్యదర్శి కురుమునాథ్ భొత్ర, పార్టీ నేతలు పూర్ణ చంద్ర సురు, గోవర్ధన్‌గోండ్, విఘ్నరాజ్ అమనాత్య పాల్గొన్నారు.
కమ్యూనిస్టు నేతల నిధుల సేకరణ


