పౌరహక్కుల సంఘం నేతల సమావేశం
పర్లాకిమిడి: స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపతి రాయ్ జయంతి సందర్భంగా పర్లాకిమిడి ప్యాలస్‌లో యుటెక్ కంప్యూటర్ కేంద్రంలో భారతీయ పౌరహక్కుల సంఘం సమావేశం జరిగినది. ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా అధ్యక్షత వహించగా.. స్వాగత ఉపన్యాసం మానవహక్కుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమార్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఎల్.కె.పాఢి, జిల్లా కార్యదర్శి హరిమోహన్ పట్నాయక్ వ్యవహారించారు. సమావేశంలో పౌరహక్కులు, వాటి ఉల్లంఘించిన అధికారులపై తీసుకోవాల్సిన చర్యలపై రాజేష్ కుమార్ మిశ్రా వివరించారు. ఈ సందర్భంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ప్రశంసాపత్రాలు, ఽఐడీ కార్డులను మిశ్రా అందజేశారు. సంఘ సభ్యులు లోకనాథ మిశ్రా, సంగ్రాం మహారాణా, సుభ్రత్ కుమార్ మహారాణ సహకరించారు.
గుర్తింపుకార్డులు అందజేస్తున్న ప్రతినిధులు


