ఉన్నత ప్రమాణాలపై పరిశోధనలు అవసరం
జయపురం: ఉన్నత ప్రమాణాలపై పరిశోధనలు అవసరమని వక్తలు అన్నారు. ‘ఉన్నత ప్రమాణాలపై పరిశోధన వ్యాసాలు, పరిశోధన ప్రతిపాదనలు రచించటానికి సమర్ధవంతమైన వ్యూహాలు’ అనే ఆంశంపై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రొగ్రాన్ని స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో మానవ వనరుల అభివృద్ధి కేంద్రం శుక్రవారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శ్రీలంక వాయింబ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కిర్తిసిరి సమరకూన్, ఒడిశా శిక్షా ఓ అనుసంధాన్ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ నిహారంజన్ మిశ్ర, కొరాపుట్ కేంద్రవిశ్వ విద్యాలయం ప్రొఫెసర్ శౌరభ గుప్త హాజరై.. పరిశోధనల రచన, ప్రచురణల వ్యూహాలు, పరిశోధన ప్రతిపాదనల తయారీలో అనుసరించాల్సిన విధానాలపై ప్రసంగించారు. కార్యక్రమాన్ని నిర్వాహక కార్యదర్శి డాక్టర్ దేవదత్త ఇండోరియ పర్యవేక్షించారు. విక్రమదేవ్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ దేవీప్రసాద్ మిఽశ్ర ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో నాణ్యమైన పరిశోధనలు అవసరమన్నారు. కార్యక్రమంలో జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ రిజస్ట్రార్ మహేశ్వరచంద్ర నాయిక్, పీజీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పి.కె.పాత్రో, డాక్టర్ సాగరిక మిశ్ర, విశ్వవిద్యాలయ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ సచిన్ కుమార్ నాయిక్, వివిధ కళాశాలల నుంచి 250 మందికిపైగా అధ్యాపకులు పాల్గొన్నారు.


