టెన్త్‌ శిక్షణ శిబిరం సందర్శన | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ శిక్షణ శిబిరం సందర్శన

Feb 8 2026 4:22 AM | Updated on Feb 8 2026 4:22 AM

టెన్త

టెన్త్‌ శిక్షణ శిబిరం సందర్శన

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్‌ సోమనాథ్‌ ప్రధాన్‌ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 2026 పదవ తరగతి బోర్డు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు నిర్వహిస్తున్న రెండో విడత నివాస శిక్షణ కార్యక్రమాన్ని జగన్నాధపల్లి హైస్కూల్‌, బలిమెళాలోని పీఎంశ్రీ హైస్కూల్‌ను శనివారం సందర్శించారు. ఆయనతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజాన్‌ పాణిగ్రాహి కూడా ఉన్నారు. ఈ నివాస శిక్షణలో తొలివిడతలో 200 మంది ఎంపికై న విద్యార్థులకు నాలుగు కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా పిల్లలకు ఉచిత భోజనం, విద్యాసామగ్రి, యోగాఅభ్యాసం, నిపుణులచే రోజు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదనపు కలెక్టర్‌ విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలు, బోధనపై ఆరాతీసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి సారించాలని శిక్షణ కేంద్ర నిర్వహికులు ఇ.ఈశ్వరరావుకు సూచించారు .

టెన్త్‌ శిక్షణ శిబిరం సందర్శన 1
1/1

టెన్త్‌ శిక్షణ శిబిరం సందర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement