శివరాత్రికి మహారాజుకు ఆహ్వానం
జయపురం: నాలుగు వందల ఏళ్ల పురాతన చరిత్ర గల గగణాపూర్ బాలుకేశ్వర్ మహాదేవుని పీఠంలో కొత్తగా నిర్మించిన యజ్ఞమండప ప్రతిష్టాపన, మహా శివరాత్రి ఉత్సవాలకు జయపురం మహారాజు విశ్వేశ్వర చంధ్రచూడ్ దేవ్‌ను ఆలయ కమిటీ ఆహ్వానించింది. గురువారం ఆలయ పరిచాలన కమిటీ సభ్యులు పిలు దాస్, సురేష్ నందొ, జితు దొలాయి, సిద్ధు పాణిగ్రహి, సదాశివ పట్నాయిక్, పురుషోత్తమ పురోహిత్‌లు జయపురం రాజుగారి కోటకు వచ్చి మహారాజును ఆహ్వానించారు. యజ్ఞ మండపం ప్రారంభోత్సవం, శివరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహించే అష్ట్రపహర నామ యజ్ఞం, రుద్రాభిషేకం, కలశ జాత్ర నిర్వహిస్తామని, కలశ జాత్ర జయపురం ఖజురి బంద ద్వారా జగన్నాథ్ ఆలయ మీదుగా సర్దార్ పటేల్ మార్గం మీదుగా గగణాపూర్ బాలుకేశ్వర్ మహాదేవుని ఆలయానికి చేరుతుందని ఆయా కార్యక్రమాలలో పాల్గొనాలని వారు ఆహ్వానించగా అందుకు ఆయన అంగీకరించారు.


