వెదురు హస్తకళల ద్వారా జీవనోపాధిపై వర్క్‌షాప్
జయపురం: స్థానిక నెహ్రూనగర్‌లో తెలుగు సాంస్కృతిక సమితి జయపురం సిటీ ఉన్నత పాఠశాలలో పర్యావరణ అధ్యయన కేంద్రం (సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్), ఒడిశా అటవీ అండ్ పర్యావరణ విభాగం భువనేశ్వర్, సహకారంతో వెదురు కళలపై గురువారం వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో వెదురు కళా–హస్తకళల ద్వారా ప్రజలు ఎలా స్వయం ఉపాధి పొందవచ్చో వివరించారు. జయపురం, పరిసర ప్రాంతాల్లో అపారంగా ఉన్న వెదురు ఉత్పత్తులను వాణిజ్యీకరణకు వినియోగించాల్సిన అవసరాన్ని ఈ వర్క్‌షాపులో పాల్గొన్న ఇకో క్లబ్బు వెదురుకళా శిక్షకుడు నృశింగ ప్రసాద్ షొడంగి వివరించారు. వెదురు మన ప్రాంతానికి చెందిన సహజ వనరు అని, సంప్రదాయ వెదురు కళలను ప్రోత్సహించటం, అలాగే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఈ వర్క్‌షాపు ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఇకో క్లబ్బు ఉపాధ్యాయుడు ప్రతాప్ కుమార్ పట్నాయిక్ మాట్లాడుతూ ఈ వర్క్‌షాపు ద్వారా జయపురం ప్రాంతంలో వెదురు కళకు సమాజంలో తగిన గుర్తింపు తీసుకు రావటం, విద్యార్థుల్లో ఆసక్తి కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించటం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు కలుగుతుందని వర్క్‌షాపులో పాల్గొన్న వారికి ఉద్బోధించారు. శిక్షకులు నృిశింగ ప్రసాద్ షొడంగి, బేబీ మహాపాత్రోలు వెదురుతో పూల కుండీలు, దీపపు స్టాండ్‌లు పెన్ స్టాండ్‌లు, వెదురు బాటిళ్లు, కుర్చీలు, టేబుల్లు మొదలగు కళాత్మక వస్తువులను సులభంగా తయారు చేసే పద్ధతిని బోధించారు.
వర్క్‌షాపులో పాల్గొన్న విద్యార్థులకు వెదురుతో వస్తువులు తయారు చేసే విధానం చూపుతున్న శిక్షకుడు
వెదురుతో అందమైన పువ్వులు తయారు చేయటం నేర్పుతున్న శిక్షకుడు
వెదురు హస్తకళల ద్వారా జీవనోపాధిపై వర్క్‌షాప్
వెదురు హస్తకళల ద్వారా జీవనోపాధిపై వర్క్‌షాప్
వెదురు హస్తకళల ద్వారా జీవనోపాధిపై వర్క్‌షాప్


