రైతులసమస్యలు సీఎం పరిష్కరిస్తారు
● రాష్ట్ర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక శాఖ మంత్రి సంపద్ చరణ్ స్వయిని
జిల్లా స్థాయి ధాన్యం సేకరణపై సమీక్ష సమావేశంలో కలెక్టర్, ఎమ్మెల్యే రూపేష్, మంత్రి సంపద్ చరణ్ స్వయిని, ఎమ్మెల్యే దాశరథి గోమాంగో
పర్లాకిమిడి: రాష్ట్ర పరిశ్రమలు, స్కిల్ డెవలప్‌మెంట్, సాంకేతిక విద్యాశాఖ మంత్రి సంపద్ చరణ్ స్వయిని గురువారం మధ్యాహ్నం గజపతి జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఆయనకు బీజేపీ పార్టీ శ్రేణులు ఛిత్రి సింహాద్రి, ఎంపీ ప్రతినిధి దారపు చిట్టి తదితరులు సర్క్యూట్ హౌస్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఽఖరీఫ్ ధాన్యం ప్రొక్యూర్‌మెంట్ జిల్లాలో ఎంతవరకూ లక్ష్యం ఎంతవరకూ వచ్చిందో తెలుసుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మోహన ఎమ్మెల్యే దాశరథిగో మంగో, జిల్లా పౌరసరఫరాల శాఖఅధికారి అనుప్ పండా, కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రి సంపద్ స్వయిని బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. గుసాని సమితిలో గారబంద, లావణ్యగడ ధాన్యం మండీలను పరిశీలించారు. అయితే రైతులు ఽధాన్యం కోనుగోళ్ల కేంద్రాల వద్ద ఆభియోగాలు ముందుంచారు. తప్పకుండా రైతు సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించి తగు పరిష్కారం చేస్తామని, రైతుల ఆదాయం పెంపుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి కట్టుబడి హున్నారని అన్నారు. ఇప్పటివరకూ గజపతి జిల్లాలో నాలుగు బ్లాక్‌లలో కాశీనగర్, రాయఘడ, గుసాని, గుమ్మలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేశామని, మరో 10వేల మంది రైతులు మండీల వద్ద రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని మంత్రి సంపద్ చరణ్ స్వయిని అన్నారు. సమీక్ష సమావేశంలో జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి అధికారి స్మృతిరంజన్ సౌభాగ్య త్రిపాఠి, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన గంజాం జిల్లా సోన్‌పూర్‌కు వెళ్లిపోయారు.


