గౌరీ శంకర్‌కు అభినందనలు
రాయగడ:బీజేడీ సీనియర్ నాయకుడు, అమో ఒడిశా – నవీన్ ఒడిశా కన్వీనర్, రాయగడ సమితి మాజీ వైస్ చైర్మన్ పట్నాన గౌరీ శంకర్ జిల్లా బీజేడీ వర్కింగ్ ప్రెసిండెంట్‌గా నియమితులవ్వడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మాజీ మంత్రి, జిల్లా బీజేడీ అధ్యక్షుడు జగన్నాథ సరక, రాయగడ పట్టణ యువ జనతా దళ్ అధ్యక్షుడు శారదీ పట్నాయక్, ఆ పార్టీ యువ నాయకుడు బినోద్ పొల్లాయ్ తదితరులు గురువారం జేకేపూర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అభినందించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
గుణుపూర్‌లో చోరీ
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో ఉన్న గాంధీ టెక్నాలజీ విశ్వవిద్యాలయం సమీపంలో నివసిస్తున్న ఒక అధ్యాపకుడి ఇంట్లో బుధవారం చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోని రెండు బంగారు గొలుసులు, రెండు ఉంగరాలను దొంగిలించారు. బాధితుడు డాక్టర్ దేవాశిష్ మహాపాత్రో గుణుపూర్ ఆదర్శ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సైంటిఫిక్, డాగ్ స్క్యాడ్ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. ఐఐసీ కేకేబీకే కుహోరో తెలియజేసిన వివరాల ప్రకారం.. గత శనివారం అధ్యాపకుడు సెలవులపై స్వగ్రామమైన బరంపురం వెళ్లారు. సెలవులు ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన అనంతరం అతడి బీరువాలో ఉంచిన బంగారు గొలుసులు, ఉంగరం కనిపించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
వ్యక్తి మృతదేహం లభ్యం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి ఎంవీ 16 వద్ద గురువారం ఉదయం కెందు ఆకుల గోదాం వెనుక భాగంలో ఒక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ వినోద్ పటేల్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, మృతుడు ఉత్తమ్ విశ్వస్(35)గా గుర్తించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఉత్తమ్ రాత్రి తిరిగి ఇంటికి రాలేదు. అయితే మాల్యవంత్ ఉత్సవాల్లో ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. కాగా గురువారం ఉదయం విగతజీవిగా కనిపించడంతో రోధిస్తున్నారు. మృతదేహన్ని పరిశీలించి హత్యగా భావిస్తున్నారు. శుక్రవారం పోస్టుమాఠం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టును ఢీకొన్న బస్సు
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి మోటు నుంచి మల్కన్‌గిరి వస్తున్న ఒక ప్రైవేటు బస్సు బుధవారం ఉదయం 6 గంటల సమయంలో అదుపు తప్పి పూషుగూడ కూడలి వద్ద ఒక చెట్టును ఢీకొంది. అయితే ప్రమాదంలో బస్సులో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు అవ్వకుండా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారు. అయితే బస్సు ముందరి భాగం దెబ్బతింది.
గౌరీ శంకర్‌కు అభినందనలు
గౌరీ శంకర్‌కు అభినందనలు
గౌరీ శంకర్‌కు అభినందనలు
గౌరీ శంకర్‌కు అభినందనలు


