38 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో అక్రమ గంజాయి సాగుని సమూలంగా నివారించేందుకు పోలీసులు, రెవెన్యూ, అటవీ, అబ్కారి సిబ్బంది సంయుక్తంగా కృషి చేస్తున్నారు. విస్తృతంగా గ్రీన్ క్లీన్ అభిజాన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బొయిపరిగుడ సమితి మఝిగుడ పంచాయతీ మారుమూల అటవీ ప్రాంతంలోని భటాపడ గ్రామ సమీపంలో ప్రభుత్వ భూమిలో 38 ఎకరాల భూమిలో గంజాయి పంటను కనుగొన్నారు. వెంటనే గంజాయి మొక్కలను పొలాల నుంచి తొలగించి నిప్పు పెట్టి కాల్చివేసినట్లు బొయిపరిగుడ పోలీసు అధికారి డొంబురుదొర బత్రియ వెల్లడించారు. ఈ అభిజాన్‌లో గంజాయి మొక్కలు తొలగించేందుకు ఒక ప్లాటూన్ పోలీసు ఫోర్స్‌ను వినియోగించినట్లు వెల్లడించారు. ఈ అభిజాన్‌లో అటవీ విభాగ ిసిబ్బంది సహకరించినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఇటీవల నక్సల్ ప్రభావిత ప్రాంతంలో సాగు చేసిన వందలాది ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినట్లు గుర్తు చేశారు.
గంజాయి స్వాధీనం
రాయగడ: జిల్లాలోని బిసంకటక్‌లో బుధవారం అబ్కారీ శాఖ అధికారులు తొమ్మిది కిలోల మూడు వందల గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడు కంధమాల్ జిల్లాలోని లండగా ముధథాబలి గ్రామానికి చెందిన శివ బేసార అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 93 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు అబ్కారీ శాఖ సిబ్బంది బిసంకటక్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పట్టుకుని అతని వద్ద గల బ్యాగును తనిఖీ చేయగా గంజాయి బయటపడింది.


