జాతరలో భక్తుల సందడి
రాయగడ: కొలనార సమితి పరిధిలోని ముకుందపూర్ సమీపంలో గల మా కులబంధు ఠకురాణి జాతర ఆదివారం వైభవంగా జరిగింది. రెండేళ్లకొసారి ఈ అమ్మవారి జాతర జరుగుతుంది. అదేవిధంగా ఒక్కరోజు పాటు జరిగే ఈ అమ్మవారి జాతరను తిలకించేందుకు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఈసారి కూడా అమ్మవారి జాతరలో భక్తుల సందడి కనిపించింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కుబడులను తీర్చుకున్నారు. అక్కడే వంటావార్పులు ఆనందంగా గడిపారు. యాత్రలో 30 వేలకు పైచిలుకు భక్తులు ఈసారి హాజరయ్యారని నిర్వాహకులు అంచనా వేశారు.
జాతరలో భక్తుల సందడి


