ముందుకు సాగాలి: ముఖ్యమంత్రి | - | Sakshi
Sakshi News home page

ముందుకు సాగాలి: ముఖ్యమంత్రి

Feb 8 2026 3:59 AM | Updated on Feb 8 2026 3:59 AM

ముందు

ముందుకు సాగాలి: ముఖ్యమంత్రి

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 8 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సాంకేతిక పరిజ్ఞానంతో

భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ 21వ త్రైవార్షిక సమావేశం

భువనేశ్వర్‌: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆటోమేషన్‌, క్వాంటం కంప్యూటింగ్‌ వంటి భవిష్యత్‌ సాంకేతికతలు కార్మిక రంగాన్ని మారుస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సాంకేతికత పోకడతో కొనసాగేందుకు కార్మిక శక్తిని తిరిగి నైపుణ్యపరచుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పూరీలో జరిగిన భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) 21వ త్రైవార్షిక సమావేశంలో ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి మాట్లాడుతూ సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, కార్మికుల సంక్షేమం ద్వారా దేశ భవిష్యత్తు వృద్ధిని శక్తివంతం చేయడంలో ఒడిశా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో కార్మికులకు అత్యున్నత గౌరవం ఉందన్నారు. జగన్నాథుడి సంప్రదాయాన్ని ఉటంకిస్తూ ఈ తత్వ శాస్త్రం కార్మిక సంబంధాలను, విధాన రూపకల్పనను మార్గనిర్దేశం చేస్తుంది. కాబట్టి ఏ పనినీ చిన్నదిగా లేదా పెద్దదిగా పరిగణించబోమని ఆయన అన్నారు. భారత దేశం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద శ్రామిక శక్తిని కలిగి ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 13 మిలియన్ల మంది యువత ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) కారణంగా అనేక సంప్రదాయ ఉద్యోగాలు

కనుమరుగవుతున్నది వాస్తవం. నైపుణ్యాభివృద్ధి, సరికొత్త్త సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించి ఈ పరిస్థితిని అధిగమించాలని ప్రోత్సహించారు.

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో, విద్య, పరిశ్రమల అవసరాల గురించి మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాన్ని స్వాగతించారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఐదేళ్లలో 500 అగ్ర స్థాయి కంపెనీలలో ఒక కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్‌లను అందించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొన్నారు.

రాష్ట్రంలో పారిశ్రామిక రంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తుందన్నారు. గత 20 నెలల్లో రూ. 2.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. మరి కొద్ది కాలంలో దాదాపు రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడిని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ వృద్ధికి మద్దతు ఇవ్వడానికి శిక్షణ పొందిన, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అవసరం. పాత కార్మిక చట్టాలను సవరించి కార్మికులకు సామాజిక భద్రత, ఆరోగ్య సౌకర్యాలు, ఓవర్‌టైమ్‌ నిబంధనలను బలోపేతం చేసేందుకు 4 కార్మిక కోడ్‌లు జోడించారు. ఒడిశాలో కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఒడిశా భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కింద 5.1 మిలియన్లకు పైగా కార్మికులు లబ్ధి పొందుతున్నారు. వారి పిల్లలకు విద్య, వివాహ సహాయం, ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ. 6 లక్షల వరకు పరిహారం వంటి సహాయాలు అందజేస్తున్నారు.

ఐటీఐ, డిప్లొమా కోర్సులకు స్కాలర్‌షిప్‌లు, పరిశ్రమల్లో గృహ సౌకర్యాలు, అసంఘటిత కార్మికులకు సంక్షేమ చర్యలు, అనేక జిల్లాల్లో 200 రోజుల ఉపాధి హామీ వంటి పథకాలు వలసలను అరికట్టడానికి సహాయపడుతున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. మారుతున్న కార్మిక రంగంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కార్మిక సంఘాలను అభ్యర్థించారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడుతు నైపుణ్యం పెంపొందించే కార్యక్రమాలకు చురుకుగా మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి అన్నారు. 2036 నాటికి ఒడిశా సంపన్న రాష్ట్రంగా, 2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా పయనిస్తోంది. ఈ దార్శనికతను సాధించడంలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తారు. కార్మికుల గౌరవం, భద్రత, భవిష్యత్‌ను కాపాడటానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు హిరణ్మయి పాండ్యా, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ, జనరల్‌ సెక్రటరీ సురేంద్ర కుమార్‌ పాండే, ప్రధాన కార్యదర్శి రబీంద్ర హిమేతే, ప్రముఖ కార్మిక నేత యుకీ వట్సుజీ, వివిధ దేశాల నుండి వచ్చిన కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ముందుకు సాగాలి: ముఖ్యమంత్రి1
1/2

ముందుకు సాగాలి: ముఖ్యమంత్రి

ముందుకు సాగాలి: ముఖ్యమంత్రి2
2/2

ముందుకు సాగాలి: ముఖ్యమంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement