పూరీలో రాష్ట్రపతి ముర్ము | - | Sakshi
Sakshi News home page

పూరీలో రాష్ట్రపతి ముర్ము

Feb 5 2026 7:15 AM | Updated on Feb 5 2026 7:15 AM

పూరీల

పూరీలో రాష్ట్రపతి ముర్ము

భువనేశ్వర్‌: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూరీలో పూర్వీకులకు పిండ ప్రదానం చేశారు. బుధవారం తొలుత శ్వేత గంగలో సంప్రదాయబద్ధంగా పూర్వీకులకు పిండ ప్రదానం చేసిన అనంతరం జగన్నాథ ఆలయం సందర్శించారు. గర్భ గుడిలో మూల విరాటుల్ని దర్శించుకుని ర్నత వేదికకు ప్రదక్షిణం చేశారు. జగన్నాథుని ఆశీస్సులు పొందారు.ఆలయ సందర్శన సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి ఉన్నారు. శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో ముఖ్యమంత్రికి వీరంతా సాదరంగా స్వాగతించారు. రాష్ట్రపతి సందర్శన దృష్ట్యా భద్రతా ఏర్పాట్ల మధ్య దర్శనం సులభతరం చేసేందుకు ఉదయం 10 గంటల వరకు సాధారణ భక్తుల ప్రవేశం నివారించి సర్వ దర్శనం నిలిపివేశారు. పూరీలో కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత రాష్ట్రపతి ముర్ము భారత వైమానిక దళం హెలికాప్టర్‌లో మయూర్‌భంజ్‌ జిల్లాలోని తన స్వస్థలం రాయరంగ్‌పూర్‌కు బయలుదేరారు.

తొలుత పూర్వీకులకు

పిండ ప్రదానం

అనంతరం శ్రీమందిరంలో

జగన్నాథునికి పూజలు

స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం

పూరీలో రాష్ట్రపతి ముర్ము1
1/2

పూరీలో రాష్ట్రపతి ముర్ము

పూరీలో రాష్ట్రపతి ముర్ము2
2/2

పూరీలో రాష్ట్రపతి ముర్ము

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement