వారధి.. భయపెడుతున్నది
మేఘవరం పంచాయతీలో బొరిగిపేట, మేఘవరం గ్రామాలకు వెళ్లే మార్గంలో వంశధార ప్రధాన కాలువ పై ఉన్న వంతెనలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ఆయా గ్రామాల ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. టెక్కలి నుంచి బొరిగిపేట గ్రామానికి వెళ్లే మార్గంలో వంశధార ప్రధాన కాలువ పై ఉన్న వంతెన నిర్మాణం చేపట్టి దశాబ్దాలు గడిచాయి. ఇదే మార్గంలో అనేక గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. మరో వైపు పదికి పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరడం, అంతే కాకుండా భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అలాగే మేఘవరం గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వంతెన సైతం ఇదే దుస్థితిలో ఉంది. ఇప్పటికై నా పాలకులు స్పందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – టెక్కలి
వారధి.. భయపెడుతున్నది


