బీజేపీలో పలువురి చేరిక
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలలో గల కళ్యాణ మండపంలో బీజేపీ కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.గోపి ఆనంద్ ముఖ్యఅతిథిగా, సీనియర్ నాయకులు శివశంకర్ ఉలక, పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు రామచంద్ర బెహరా, పార్టీ రాష్ట్ర శాఖ ఎస్సీ, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు కాళీరాం మాఝి, జిల్లా సాధారణ కార్యదర్శి భికారి నాహక్, ఉపాధ్యక్షుడు సుశీల్ సురాఫ్, దేవాశీస్ పండ, శాంతను సుబుద్ధి, వర్మిష్టా సామంత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపీఆనంద్ మాట్లాడుతూ జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సమితి వారిగా సమావేశాలను నిర్వహించి, పార్టీ సిద్ధాంతాలు, ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించాన్నారు.
రానున్న పంచాయతీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కార్యకర్తలు పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన మిశ్రణ కార్యక్రమంలో బీజేడీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వంద మందికిపైగా కర్యాకర్తలు బీజేపీలో చేరారు. వీరికి గోపీఆనంద్ కండువాలు వేసి స్వాగతం పలికారు. అంతా కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.


