మావోయిస్టు లొంగుబాటు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ వినోద్ పటేల్ ఎదుట బుధవారం ఛత్తీష్‌గఢ్ మావోయిస్టు సంస్థకు చెందిన శుక్రామ్ మాడాకం స్వచ్ఛందంగా లొంగిపోయాడు. అత్యాధునిక ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీని ఎస్పీ అందజేశాడు. 12 సజీవ కార్ర్‌టిడ్జ్‌లు, రెండు ల్యాండ్‌మైన్‌లు, కోడెక్స్ వైర్లు, విద్యుత్ లైన్లు, మందులు, మావో దుస్తులను సమర్పించారు. ఛత్తీష్‌గఢ్ సుకుమా జిల్లా, మల్కన్‌గిరి మాత్తిలి సమితి దల్దలి ప్రాంతంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనల్లో కీలక పాత్ర వహించాడు. ఈయనపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.21 లక్షల రివార్డ్ ప్రకటించాయి. ప్రభుత్వ నియమం ప్రకారం లొంగిపోయిన మావోకు అందాల్సిన అన్ని సౌకర్యాలు త్వరలోనే అందజేస్తామని ఎస్పీ తెలిపారు.
మావోయిస్టు లొంగుబాటు


