తవుడు ట్రక్కు బోల్తా | - | Sakshi
Sakshi News home page

తవుడు ట్రక్కు బోల్తా

Jan 30 2026 6:55 AM | Updated on Jan 30 2026 6:55 AM

తవుడు ట్రక్కు బోల్తా

తవుడు ట్రక్కు బోల్తా

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడ సమితి శుఖ్రి ఘాట్‌ రోడ్డులో తవుడు ట్రక్కు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్‌ ప్రాణాపాయం నుంచి తృటిలో బయట పడ్డాడు. ఒక తవుడు లోడు ట్రక్కు జాజ్‌పూర్‌ నుంచి రాంచీ– విజయవాడ 326 జాతీయ రహదారి మీదుగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం విజయవాడ కు వెళ్తుండగా బొయిపరిగుడ సమితి శుఖ్రి ఘాట్‌ పై హఠాత్తుగా బ్రేక్‌ ఫెయిల్‌ అయింది. డ్రైవర్‌ ట్రక్కును అదుపు చేయలేక పోవటంతో అది బోల్తా పడింది. ఈ ప్రమాదం సమాచారం అందిన వెంటనే బొయిపరిగుడ పోలీసులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement