ఘనంగా విక్రమదేవ్ వర్సిటీ వార్షికోత్సవం
జయపురం: స్థానిక విక్రమదేవ్ యూనివర్సిటీ మూడో వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ దేవీ ప్రసాద్ మిశ్ర అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ డాక్టర్ ప్రభాకర మహంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మండియ రాణి పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ రొయిమతి ఘివురియ, డాక్టర్ కర్నల్ దాస్, మాజీ ఎమ్మెల్యే గుప్త ప్రసాద్ దాస్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర మహంతి మాట్లాడుతూ.. విక్రమదేవ్ విశ్వ విద్యాలయం బహుళ ఆదివాసీ ప్రాంతంలో విద్యా ప్రగతికి అందిస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం వర్సిటీ స్థాపన దినోత్సవంలో విశ్వవిద్యాలయ పత్రిక ‘విక్రమ్’ను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
బీజేడీ ఆధ్వర్యంలో వేడుకలు
విక్రమదేవ్ విశ్వ విద్యాలయం వార్షికోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్‌కు అభినందనలు తెలుపుతూ బీజేడీ శ్రేణులు కార్యక్రమాన్ని చేపట్టాయి. వర్సిటీ ప్రధాన గేటు వద్ద బిజూ ఛాత్ర జనతా దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు చేపట్టారు. ఈ వర్సిటీ నవీన్ పట్నాయక్ కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేడీ కార్యవర్గ అధ్యక్షుడు దుర్గ మిశ్ర, జయపురం పట్టణ బీజేడీ అధ్యక్షుడు ఎ.శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కుని అధికారి, శివ పట్నాయిక్, పార్టీ కార్మిక విభాగ నేత బాలారాయ్, పట్టణ మాజీ అధ్యక్షుడు హరమిశ్ర తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా విక్రమదేవ్ వర్సిటీ వార్షికోత్సవం


