ప్రజాభిప్రాయం మేరకే జీతాలు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజాభిప్రాయం మేరకే జీతాలు పెంచాలి

Feb 4 2026 7:03 AM | Updated on Feb 4 2026 7:03 AM

ప్రజాభిప్రాయం మేరకే జీతాలు పెంచాలి

ప్రజాభిప్రాయం మేరకే జీతాలు పెంచాలి

జయపురం: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలను ప్రజాభిప్రాయం మేరకే పెంచాలని ఒడిశా రాష్ట్ర యాంటీ కరప్షన్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు సుభ్రత్‌ కుమార్‌ నందో అన్నారు. పట్టణంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో పత్రికా సమావేశాన్ని జిల్లా ఆర్గనైజేషన్‌ అధ్యక్షులు జి.రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. జీతాలు, పెన్షన్లు పెంచేందుకు ప్రతిపాదన తీసుకు రావడం రాష్ట్ర ప్రభుత్వ చారిత్రక తప్పిదమన్నారు. రాష్ట్రంలో లోకాయుక్త చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తమ ఉద్యమంలో ప్రజలు, యువత మమేకమవ్వాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆర్గనైజేషన్‌ నవరంగపూర్‌ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ ఈశ్వరరావు, కో–ఆర్డినేటర్‌, ఆదివాసీ నేత అర్జున్‌ బాగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement