రిటైర్డు ఉద్యోగికి సత్కారం | - | Sakshi
Sakshi News home page

రిటైర్డు ఉద్యోగికి సత్కారం

Feb 7 2026 2:56 PM | Updated on Feb 7 2026 2:56 PM

రిటైర్డు ఉద్యోగికి సత్కారం

రిటైర్డు ఉద్యోగికి సత్కారం

జయపురం: జయపురం గోష్టీ విద్యాధికారి కార్యాలయంలో పదవీ విరమణ చేసిన గ్రూపు–4 ఉద్యోగిని సిబ్బంది ఘనంగా సన్మాణించారు. నాల్గొవ తరగతి ఉద్యోగి రమేష్‌ చంద్ర పాలక ఎంతో కాలంగా సేవలు అందించారని.. అతడి సేవలు మరువ లేనివని ముఖ్యఅతిథిగా పాల్గొన్న జయపురం గోష్టీ(బ్లాక్‌ విద్యాధికారి) విద్యాధికారి చందన్‌ కుమార్‌ నాయిక్‌ ప్రశంసించారు. కార్యక్రమంలో విద్యాఽవిభాగ అధికారి రాజేంద్రనారాయణ పాఢీ, బొరిగుమ్మ గోష్టి విద్యాధికారి పద్మేశ్వర బిశాయిలు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. సీనియర్‌ అసిస్టెంట్‌ శశిభూషణ దాస్‌ అధ్యక్షతన నిర్వహించబడిన సన్మాన సభలో ఉపాధ్యాయులు మహేశ్వర మిశ్ర, జగదీష్‌ మిశ్ర, ప్రదీప్‌ మిశ్ర, పురందర్‌ నాయిక్‌, త్రినాథ్‌ పాణిగ్రహి, జయపురంలోనిల అన్ని గోష్టీ సాధనా కేంద్రాల సమన్వయకర్తలు, బ్లాక్‌ సహాయ విద్యాధికారులు కె.గోపాల్‌, సోమనాథ్‌ గదబ, గోపీనాథ్‌ మహంతి, కృష్ణ చంద్ర పండ, ఎం.మురళి, రజణీకాంత ఘొడయి, అనేక మంది విద్యా విబాగ ఉద్యోగులు పాల్గొని విద్యోగ విరమణ చేసిన రమేష చంద్ర పాలకకు శాలువ కప్పి జ్ఞాపికలతో సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement