కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమైనది
జయపురం: ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ చారిత్రాత్మకమైనదని ఒడిశా గణ విద్యామంత్రి నిత్యానంద గోండ్ అన్నారు. సోమవారం జయపురంలోని ఒక ప్రైవేటు హోటల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒక లక్ష 20 వేల కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. గతేడాది రాష్ట్రానికి కేవలం 14 వేల కోట్లు మాత్రమే కేటాయించారని గుర్తు చేశారు. ఈ ఏడాది నిరుపేదలు, రైతులు, యువత, మహిళల ఆర్థిక ప్రగతికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. సమావేశంలో కోట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాథ్ మచ్చ, నవరంగపూర్ ఎమ్మెల్యే గౌరీ మఝి, కొరాపుట్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శివ ముదులి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ శాశ్వత సభ్యులు గౌతమ్ సామంతరాయ్, నవరంగపూర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కుంజు బిహారీ దాస్, జయపురం పట్టణ బీజేపీ అధ్యక్షుడు బాబు షొండంగి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి నిత్యానంద గోండ్


