సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్ష కోసం నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్ష కోసం నిరీక్షణ

Feb 6 2026 7:27 AM | Updated on Feb 6 2026 7:27 AM

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్ష కోసం నిరీక్షణ

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్ష కోసం నిరీక్షణ

భువనేశ్వర్‌: రాష్ట్రంలో పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్ల నియామకం పరీక్ష ప్రక్రియ అర్ధంతరంగా స్తంభించిపోయింది. ఈ వ్యవహారంలో భారీ కుంభకోణం, అవినీతి, అక్రమాలు వెలుగు చూడడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీర్ఘ కాలం గడిచిన ఈ పరీక్ష తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టం కావడం లేదు. వయోపరిమితి మించిపోతున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని బాధిత వర్గం అభ్యర్థించింది. అవినీతి వ్యతిరేక వర్గం ఆధ్వర్యంలో స్థానిక దిగువ పీఎంజీ గాంధీ మార్గం నడి రోడ్డు మీద ఔత్సాహిక అభ్యర్థులు బైఠాయించి శాంతియుతంగా నిరసన ప్రదర్శించారు. అర్ధంతరంగా స్తంభించిన పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టరు భర్తీ పరీక్ష తేదీని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పరీక్ష కుంభకోణం, అక్రమాలు, అవినీతిపై సీబీఐ దర్యాప్తు తాజా స్థితిగతుల్ని బహిరంగపరచాలని అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement