వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు

Jan 31 2026 10:25 AM | Updated on Jan 31 2026 10:25 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు భర్తకు తలకొరివి పెట్టిన భార్య వరి కుప్పలు దగ్ధం మాజీ సైనికుల సంక్షేమమే ‘వీర్‌ పరివార్‌’ లక్ష్యం పీఆర్‌సీ కమిటీ ఏర్పాటులో జాప్యం తగదు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురిని రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియమిస్తూ శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీచేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా బరాటం నాగేశ్వరరావు, మైనార్టీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంఏ రఫీ, ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ఐటీ విభా గం రాష్ట్ర కార్యదర్శిగా చినపాన సాయిసందీప్‌రెడ్డిలను నియమించారు.

టెక్కలి: టెక్కలి ఆదిఆంధ్రావీధిలో భర్త చితికి భార్య తలకొరివి పెట్టిన ఘటన చోటు చేసుకుంది. జోగి మల్లేష్‌ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందా డు. ఒక్కగానొక్క కుమారుడు గతంలోనే మృతి చెందడంతో భార్య సీతమ్మ అంత్యక్రియలు పూర్తి చేసింది.

సంతబొమ్మాళి: తాళ్లవలసలో శుక్రవారం వరి కుప్పలు దగ్ధమయ్యాయి. దుబ్బాక శశిభూషణరావు, పురుషోత్తం, కామమ్మ, గున్న పాపారా వులకు చెందిన సుమారు ఐదు ఎకరాల వరి చేనుకుప్పలు కాలిపోవడంతో సుమారు రూ.2 లక్షలు నష్టం వాటిల్లింది. పారిశుద్ధ్య కార్మికు లు రోడ్డు ఇరువైపులా చెత్త పోగుచేసి ఒకేచోట మంట పెట్టారు. ఈ క్రమంలో పక్కన ఉన్న వరి కుప్పలకు అంటుకోవడంతో దగ్ధమయ్యా యని స్థానికులు అంటున్నారు. టెక్కలి అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: దేశం కోసం సేవలందించిన మాజీ సైనికుల సంక్షేమం, వారి కుటుంబాల రక్షణే లక్ష్యంగా ‘నాల్సా వీర్‌ పరివార్‌ సహాయత యోజన–2025’ను ప్రవేశపెట్టినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పెద్దరెల్లి వీధిలో జిల్లా సైనిక్‌ బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. నూతనంగా ఏర్పాటు చేసిన లీగల్‌ సర్వీస్‌ క్లినిక్‌ని ప్రారంభించి, మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమ స్యలపై చర్చించారు. కార్యక్రమంలో స్పెషల్‌ జడ్జి (పోక్సో) ఎన్‌.సునీత, ప్యానెల్‌ అడ్వకేట్‌ వి.జ్యోతిర్మయి, పారా లీగల్‌ వలంటీర్‌ కె.ఆదిత్యకుమార్‌, కెప్టెన్‌ పి.ఈశ్వరరావు, జిల్లా సైనిక సంక్షేమ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం: పాత పీఆర్‌సీ గడువు పూర్తయి 30 నెలలు గడిచినా 12వ పీఆర్‌సీ కమిటీని ఏర్పా టు చేయకపోవడం తగదని ఎస్టీయూ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పీఆర్‌ సీ జాప్యంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన ర్లలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఈ మేరకు ఎస్టీయూ రాష్ట్ర కన్వీనర్‌ ఎస్వీ రమణమూర్తి నేతృత్వంలో శ్రీకాకుళం తహసీల్దార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ప్రకటిస్తామ ని, ఆర్థిక బకాయిల చెల్లింపులు చేస్తామని, పెన్షనర్లకు పెన్షన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తా మని హామీలిచ్చి ఇప్పుడు విస్మరించడం తగదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఫిబ్రవరి 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా, 25న ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాల ని నిర్ణయించామని, ఉపాధ్యాయులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

బరాటం

నాగేశ్వరరావు

చినపాన

సాయిసందీప్‌రెడ్డి

ఎంఏ రఫీ

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు 1
1/6

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు 2
2/6

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు 3
3/6

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు 4
4/6

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు 5
5/6

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు 6
6/6

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగాల్లో ముగ్గురికి చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement