స్కౌట్స్, గైడ్స్ క్యాంపు
ఉన్నత పాఠశాలలో..
పర్లాకిమిడి: భారత్ స్కౌట్స్, గైడ్స్ క్యాంపు 2025–26 జిల్లాలో రాయగడ బ్లాక్ ప్రభుత్వ ఎస్‌ఎస్‌డీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. భారత్ స్కౌట్స్, గైడ్స్ ట్రైనింగ్ క్యాంపును మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగ్ ప్రారంభించగా, ట్రైనింగ్ క్యాంపును ఒడిశా రాష్ట్ర భారత స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర ముఖ్య కమిషనర్ డాక్టర్ కాళీప్రసాద్ పట్నాయక్ ఆవిష్కరించారు. భారత్ స్కౌట్స్, గైడ్స్ క్యాంపుకు స్కౌట్స్ 384 మంది, గైడ్స్ 162, స్కౌట్ మాస్టర్స్ 98, గైడ్ కెప్టెన్స్ 32 మంది, మొత్తం 476 మంది పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన స్కౌట్స్, గైడ్స్ క్యాంపునకు జిల్లా ముఖ్యవిద్యాధికారి డాక్టర్ మయాధర్ సాహు ఆదేశాలతో భారతీయ స్కౌట్స్, గైడ్స్ జిల్లా కార్యదర్శి పురేంద్ర కుమార్ పాత్రో, అదనపు డీఈఓ ఎస్.గిరిధర్, జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, పీఈటీలు పాల్గొని సహకారం అందజేశారు.
స్కౌట్స్, గైడ్స్ క్యాంపు
స్కౌట్స్, గైడ్స్ క్యాంపు
స్కౌట్స్, గైడ్స్ క్యాంపు


