రక్తదానం.. ప్రాణదానం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో గల గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజీనిరింగ్ అండ్ టెక్నాలజీ (జిఐఇటి ) విశ్వద్యాలయంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. భువనేశ్వర్‌లో గల ఐఎంఎంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ నవీన్ కుమార్ దల్ ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లో సేవా భావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి తరహా శిబిరాలు ఎంతో దొహదపడతాయన్నారు. యువత ముందుకు వచ్చి రక్తదానంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయం అధ్యాపకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ శిబిరంలో 455 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. విశ్విద్యాలయం కులపతి డాక్టర్ ఎ.వి.ఎన్.ఎల్.శర్మ, డాక్టర్ పి.విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఈ శిబిరం జరిగింది. రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.వి.జగన్నాథరావు, తదితరులు పాల్గొన్నారు.


