ఆలిండియా సాఫ్ట్‌బాల్ పోటీలకు నలుగురు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా స్కూల్‌గేమ్స్ అండర్–17 బాలబాలికల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షి ప్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ పోటీలు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ వేదికగా ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు జరగనున్నాయి. జిల్లా నుంచి బాలురు జట్టుకు సీహెచ్ జశ్వంత్, పి.శరత్‌కుమార్, పి.హర్షఅభిరామ్, బాలికల జట్టుకు ఎ.జ్యోత్స్న ఎంపికై న వారిలో ఉన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ బాలబాలికల జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు శుక్రవారం అభినందించారు. డిర్యక్రమంలో డిప్యూటీ ఈవో విలియ మ్స్, పీడీ–పీఈటీ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ, స్కూల్‌గేమ్స్ సెక్రటరీ బీవీ రమణ, మహిళా కార్యదర్శి ఆర్.స్వాతి, జెడ్పీహెచ్ స్కూల్ కేశవరావుపేట పీడీ వై.కోటేశ్వరరావు, జి.మల్లేష్ పాల్గొన్నారు.


