ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంద్రా సమితి కుంధ్ర గ్రామంలో ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం జయపురం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం 2026 గురువారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తూ కుంద్ర సమితి లిమ పంచాయితీ మహిళా రైతు మండియ రాణిగా గుర్తింపు పొంది పద్మశ్రీ అవార్డు పొంది అంతర్జాతీయ ఖ్యాతి పొందారని తెలిపారు. ఆదివాసీ మహిళ డాక్టర్ రొయిమతి ఘివురియ కుంధ్ర సమితికే కాకుండా రాష్ట్రానికే పేరు తెచ్చారని కొనియాడుతూ వ్యవసాయ రంగానికి ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆరుగురు ఆదర్శ మహిళా రైతులను సన్మానించారు. వ్యవసాయ రంగంలో ఆదర్శ మహిళా రైతులు సాధిస్తున్న విజయాలు మహిళా రైతులకు ఆదర్శంగా ఉంటాయన్నారు. వ్యవసాయ రంగంలో మహిళల కృషి, వారి నిరంతర శ్రమ, ప్రపంచ ఆహార భధ్రతలో వారు నిర్వహిస్తున్న కీలక పాత్ర కొనియాడదగినదని అన్నారు. కార్యక్రమంలో మహిళా రైతుల హక్కులపైన సామాజిక, ఆర్థిక రంగాల్లో వారికి కల్పించాల్సిన ప్రాధాన్యతపై ప్రసంగించారు. కార్యక్రమంలో కుంధ్ర సమితి బీడీఓ పి.మనశ్మిత, మహిళా శిశు అభివృద్ధి అధికారి ఆరతీ మహాపాత్రో, ఒడిశా జీవికా సమన్వయకర్త మాణిక్ పట్నాయిక్ లిమా పంచాయతీ సర్పంచ్ శ్రీమతి బానుమతి మాసియా, కుంద్ర సమితి ఉపాధ్యక్షుడు తరుణషేన్ బిశోయి పాల్గొన్నారు.
ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం


