రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో ఒక రోజులో వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఓ బాలిక మృతి చెందింది. మల్కన్‌గిరి పోలీసు స్టేషన్ పరిధిలో గల ఎంవీ 42 గ్రామంలో గురువారం రాత్రి విషు దాస్ అనే వ్యక్తి ఇంటిలోకి ఓ కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి ముందు భాగం దెబ్బ తిన్నది. ఎవరికీ ప్రాణహాని జరగలేదు. డ్రైవర్‌ను మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుక్రవారం మల్కన్‌గిరి ఐఐసి రీగాన్‌కీండో కేసు నమోద్ చేసి ధర్యాఫ్త్ చేస్తున్నారు. అలానే పండ్రిపాణి గయరామం వద్ద శుక్రవారం ఉదయం కారు బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఐదేళ్ల బాలిక చనిపోయింది. తండ్రి బుదర పోడియామితో కలిసి శివాని పోడియమి (5) మార్కెట్‌కు వెళ్తుండగా ఘటన జరిగింది. తండ్రికి కూడా గాయాలయ్యాయి. వీరిని మల్కన్‌గిరి ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


