పార్టీ బలోపేతమే ధ్యేయం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశాన్ని శనివారం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ పరిడా అధ్యక్షత వహించారు. జిల్లా ఇన్‌చార్జ్‌లు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు హాజరయ్యారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో కమిటీలను బలోపేతం చేయడం, శక్తి కేంద్ర ప్రధానులను నియమించడం, కొత్తగా గ్రామ స్థాయి ఏజెంట్లను ఎంపిక చేయడం, మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విస్తరించడం వంటి విషయాలను ప్రస్తావించారు.
పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ సాహు మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి, చిత్రకొండ మాజీ ఎమ్మెల్యే డోంబుర్ సీశా, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు దశరథి పోడియమి, మాత్తిలి సమితి చైర్మన్ మహేశ్ బాక్క పాల్గొన్నారు.


