● 12న రాష్ట్ర వ్యాప్త సమ్మె
పర్లాకిమిడి: దేశంలో నాలుగు లేబర్ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయాలని, మన్‌రేగా (మహాత్మా గాంధీ ఉపాధి పథకం) పేరు మార్పును వెనక్కి తీసుకోవాలని, మహిళా లేబర్ పది గంటల పనిని రద్దు చేయాలన్న డిమాండ్లతో ఈ నెల 12న సాధారణ సమ్మెకు జిల్లాలోని ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ మేరకు స్థానక దండుమాలవీధిలో సి.పి.ఎం కార్యాలయంలో దండపాణి రైతో (అఖిల భారత కిసాన్ సభ), కేదార్ శోబోరో (ఏఐ.కె.ఎం.ఎస్.), పైల మురళీకృష్ణ (టి.యు.సి.సి.), జోన్న సుభాష్ చంద్రరావు (బి.కె.ఎం.యు.), నర్సింగ మాలబిశోయి (ఏ.ఐ.టి.యు.సి.), ఎం.బంగారి (సీటు), శ్రీను బెహరా, సోమేష్ తదితరులు సమావేశమై సమ్మైపె చర్చించారు.


