కలరా వ్యాప్తిపై అప్రమత్తం
రాయగడ: పట్టణంలో కలరా వ్యాప్తిపై వైద్యశాఖ అప్రమత్తమైంది. ఇటీవల తాగునీటి నమూనాలను సేకరించిన అధికారులు, తాజాగా ఆయా ప్రాంతాల్లోని ఫాస్ట్‌ఫుడ్ దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ స్టేప్టీ అధికారి ప్రకాష్ సొరేన్, సిబ్బంది దాడులను చేపట్టారు. ఇందిరానగర్, నెహ్రూ నగర్, ఆశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లోని టిఫిన్ దుకాణాల్లో తనిఖీలను నిర్వహించారు. ఎటువంటి ఆరోగ్య భద్రత లేని ఆహారాలను తినడం వల్ల కూడా కలరా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయన్నారు. అందువల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నాణ్యమైన ఆహార పదార్థాలను విక్రయించే విషయమై వారికి అవగాహన కల్పించడమైందన్నారు.
రాయగడలో కలరా వ్యాప్తి
రాయగడ: పట్టణంలో గల ఇందిరానగర్, కస్తూరీనగర్, కొత్తురు ప్రాంతాల్లో కలరా వ్యాప్తి చెందుతోంది. దీనికి సంబంధించి కొరాపుట్‌లో గల పీహెచ్ ల్యాబ్ సీనియర్ మైక్రొబయాలజిస్ట్, ల్యాబ్ ఇన్‌చార్జి అలేఖ్ నాయక్ ఆధ్వర్యంలో ఒక బృందం రాయగడలో శుక్రవారం నాడు పర్యటించింది. కలరా వ్యాపించిన ప్రాంతంలో పర్యటించిన బృందం తాగునీటి ప్రాంతాలను సందర్శించారు. తాగునీటి నుంచి కూడా కలరా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఆ దిశగా అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో గల తాగునీటి నల్లాలను పర్యవేక్షించి వాటి నమూనాలను సేకరించారు. సేకరించిన తాగునీటి నమూనాలను అధునాతన పరికరాలను వినియోగించి ప్రయోగశాలలో పరీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. సేకరించిన నీటి నమూనాల నుంచి 28 రకాల పరీక్షలను నిర్వహించి నిర్ధారణ చేస్తామని వివరించారు. సేకరించిన నమూనాల్లో భాగంగా నీటిలో ఏమైనా ఇతర సమస్యలు ఉంటే అవి కూడా గుర్తిస్తామని ఆయన చెప్పారు. రాయగడలో కలరా వ్యాప్తికి సంబంధించి జిల్లా ముఖ్యవైధ్యాధికారి సూచనల మేరకు బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించింది.
కలరా వ్యాప్తిపై అప్రమత్తం
కలరా వ్యాప్తిపై అప్రమత్తం
కలరా వ్యాప్తిపై అప్రమత్తం


